★దళిత, బహుజన మేథావులు ఖండించాలని సోషల్ మీడియాలో పోస్ట్ లు
నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు యాదాద్రి నరసింహుడి సాక్షిగా అవమానం జరిగిందా? అవును అని సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి.ఇందుకు కారణం ఇదే. సోమవారం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ని CM రేవంత్ రెడ్డి,పలువురు మంత్రులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో CM రేవంత్ దంపతులు, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుర్చీలలో కూర్చోవడం డిప్యూటీ CM భట్టి కింద కూర్చోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దళితుడైన భట్టి ని అగ్రవర్ణ కులాలు అవమాన పరుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ. సోషల్ మీడియాలో అగ్రవర్ణ కుల అహంకారం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాను. ఈ విషయంపై డిప్యూటీ CM భట్టి ఎలా స్పందిస్తాడో Wait చేయాల్సిందే మరి.
Post Views: 124