+91 95819 05907

తెలంగాణ గవర్నర్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేసి పేద కులాలకు చెందిన తమకు న్యాయం చెయ్యాలి:డాక్టర్ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ,

*గవర్నర్ తమిళసై కి వినతి పత్రం అందజేత
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:
ఎమ్మెల్సీ కావడానికి రాజ్యంగ పరంగా అన్ని అర్హతలు మాకున్నాయి. కోర్టు తీర్పుతో మా ప్రతిపాదనకు ప్రాణం వచ్చింది. తెలంగాణ గవర్నర్‌, హైకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేసి పేద కులాలకు చెందిన తమకు న్యాయం చేయాలంటూ బిఆర్ఎస్ నాయకులు డా. దాసోజు శ్రవణ్ కోరారు.

”రాజ్యంగ పరమైన అంశాలతో పాటు మా అర్హతలకు సంబధించిన అన్ని విషయాలు పరిశీలించన అనంతరం హైకోర్టు ఇచ్చిన తీర్పుని గౌరవ తెలంగాణ గవర్నర్‌ గారు అమలు చేసి పేదకులాలు చెందిన తమకు న్యాయం చేయాలి” అని కోరారు బిఆర్ఎస్ నాయకులు డా. దాసోజు శ్రవణ్. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తమ నామినేషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యంలో 31 జూలై 2023న మంత్రి మండలి చేసిన నామినేషను అమలు చేయాలని కోరుతూ డాక్టర్ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ, గవర్నర్ కు వినతి పత్రం అందించారు.

అనంతరం మీడియాతో డా. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. 31, జూలై 2023న మంత్రి మండలి మమ్మల్ని ఎమ్మెల్సీ గా నామినేట్ చేస్తూ తీర్మానం చేసింది. దాదాపు యాబై రోజుల తర్వాత సెప్టెంబర్ 25న గవర్నర్ గారు మా నామినేషన్ ని తిరస్కరించారు. 07, 12, 23 దీనిపై మేము కోర్టులో కేసు వేశాం. వాదోపవాదాలు జరుగుతున్న నేపధ్యంలోనే ప్రస్తుత ప్రభుత్వం 27, 1, 2024న ప్రో కోదండరాం, అమీర్ ఆలీ ఖాన్ ను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ అదే రోజు ఆమోదం తెలుపుతూ గెజిట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ పరిణామాలన్నిటిని పరిశీలించిన హైకోర్టు మూడు ప్రధాన సూత్రలని తీర్పుగా ఇచ్చింది. మా నియామకాలని తిరస్కరించిన గవర్నర్ నిర్ణయం తప్పని చెబుతూ గవర్నర్ నిర్ణయాన్ని రద్దు చేసింది.
ప్రో కోదండరాం, అమీర్ ఆలీ ఖాన్ నియామకం చట్టవిరుద్ధమని, వారి నియామకం కూడా రద్దు చేసింది. అలాగే మంత్రిమండలి చేసిన తీర్మానాన్ని గవర్నర్ గారు తప్పని సరిగా అమలు చేయాలనే ప్రాధమిక మూల సూత్రాన్ని కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. దీంతో మా ప్రతిపాదనకు ప్రాణం వచ్చింది” అని పేర్కొన్నారు.

‘మేము పేద కులాలకు చెందిన వారము. వ్యాపారపరమైనటు వంటి రాజకీయాలో పేద కులాలకు చెందిన మాలాంటి వరకు అవకాశాలు రావు. ఇది మాకు గొప్ప అవకాశం. నేను పీ హెచ్డీ చదువుకున్నాను. ఎంబీఎ, యంఏ, ఎల్ఎల్ బి చేశాను. ఉస్మానియా యూనివర్సిసిటీలో ప్రోఫెసర్ గా పని చేశాను. ప్రజా ఉద్యమంలో వున్నాను. విద్యార్ధి ఉద్యమాల్లో వున్నాను. ఏబీవీపీలో పని చేశాను. వరల్డ్ బ్యాంకు ప్రాజెక్ట్ లో పని చేశాను. మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో లక్షల జీతాన్ని వదిలి రాజకీయల్లోకి వచ్చాను. గత పదహారేళ్ళుగా ప్రజల గొంతుకై వున్నాను. నక్సల్ తో చర్చలు జరిపితేనే హింసకు చరమగీతం పాడినట్లు అవుతుందనే సూత్రంతో కుబుసం అనే చిత్రాన్ని నిర్మించాను. అందులోని పల్లెకన్నీరు పెడుతుందో పాట ప్రజలని ఎంతగానో ప్రభావితం చేసింది. ఆ పాటే 2004లో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చింది. ఇటు సామాజిక రంగం, కళారంగం, అటు సేవారంగంలో విశేషమైన కృషి చేశాను” అని పేర్కొన్నారు.

‘రాజ్యంగబద్ధంగా జూలై 2023న మంత్రి మండలి మమ్మల్ని ఎమ్మెల్సీ గా నియామకం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5)లో పేర్కొన్న అర్హత ప్రమాణాలకు మేము అర్హులం. అలాగే ఆర్టికల్ 191 ప్రకారం ఎటువంటి అనర్హత( Disqualifications )కూడా మాకు వర్తించదు. కాబట్టి గవర్నర్ గారు మమ్మల్ని పరిగణించాలి. తల్లిలాంటి గవర్నర్ గారు రాజ్యాంగాన్ని, మాలాంటి పేదవారిని కాపాడాలి. మాకు న్యాయం చేయాలి. కౌన్సిల్ కి వెళ్ళడానికి అన్ని అన్ని అర్హతలు వున్నాయి. కోర్టు వారు అన్ని విషయాలు పరిశీలించి తర్వాత ఇచ్చిన తీర్పుని గవర్నర్ గారు అమలు చేసి మాకు న్యాయం చేసి మా వర్గాలకు ప్రతినిధిగా చట్ట సభల్లోకి వెళ్ళే అవకాశం కల్పించాలి’ అని దాసోజు కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

అశ్వారావుపేట అభివృద్ధికి రూ.15 కోట్లు: మౌలిక వసతులే లక్ష్యంగా మంత్రి పొంగులేటి భూమిపూజ

​పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రకటన నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, జనవరి, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మున్సిపాలిటీని సర్వాంగ

Read More »

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

 Don't Miss this News !