వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు MPO
నేటి గద్దర్ న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి(పినపాక):
పినపాక మండలం తోగ్గూడెం గ్రామాన్ని తోగూడెం MPTC చింతనపంటి సత్యం ,MPO వెంకటేశ్వరరావు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా MPO వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామంలోని నీటి వసతిని పరిశీలించారు.Thogudem క్రిందిగుంపులోని ప్రతీ ఇంటికి తిరిగి నీళ్లు సక్రమంగా వస్తున్నాయో లేదో స్వయంగా పరిశీలించారు. నీళ్లు సక్రమంగా వస్తున్నప్పటికీ నీటిని నిలువ చేసుకోవడానికి సరైన వసతులు ఏర్పాటు చేసుకోలేక పోవడాన్ని గుర్తించారు. ప్రతీ ఒక్కరూ కూడా నీటిని నిలువ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతీ ఇంటికి కూడా నీటిని అందించడమే లక్ష్యమని , వేసవిలో ఏ ఒక్క కుటుంబమూ కూడా నీటి సమస్యతో ఇబ్బంది పడకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కృష్ణమూర్తి, పంచాయతీ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.