బీడీలు అమ్ముకునే వారిని ఎలా పార్టీలో జాయిన్ చేయించుకున్న సీఎం సాబ్: దానం నాగేందర్ పై అనర్హత వెయిట్ వేయాలి
నేటి గదర్ న్యూస్, హైదరాబాద్:
CM కేసీఆర్ ఆదేశాల మేరకు హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో TG శాశన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ని BRS ఎమ్మెల్యే లు పాడి కౌశిక్ రెడ్డి తో పాటు మరి కొందరు MLA లు కలిసి పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేయాలని వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఒక పార్టీ లో గెలిచి ఇంకో పార్టీ లోకి వెళ్ళటం సమంజసం కాదు..CMరేవంత్ రెడ్డి గతంలో పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టండి అంటూ పిలుపునిచ్చారని గుర్తు చేశారు.అదే రేవంత్ రెడ్డి దానం ను బీడీ లు అమ్ముకునే వాడు అని వేల పంది ప్రజలలో ప్రకటన చేసి ఇప్పుడెలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించుకున్నారని మండిపడ్డారు.ఇప్పుడు కాంగ్రెస్ లో చేర్చుకున్న CM అదే బీడీలు అమ్మిస్తారా?మూడు నెలలో పార్టీ మారిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు చెప్పింది స్పష్టం చేశారు.
నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడటం సరికాదు
మేము ఒక అడుగు వెనకడుగు వేశాం అంటే నాలుగు అడుగులు ముందు కు వేస్తాం
ఒక దెబ్బ మీరు కొట్టారు, మేము కొట్టడానికి సిద్దంగా ఉన్నాం
మీరు గేట్లు తెరిచారని అంటున్నారు మేము తెరిచే టైం వచ్చింది తెరిస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం అని వారు ఘాటుగా స్పందించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
