+91 95819 05907

టీవీ, సోషల్ మీడియా ఛానళ్లకు లీగల్ నోటీసులు పంపించిన కేటీఆర్

నేటి గద్దర్ వెబ్ న్యూస్ డెస్క్:
తమ తప్పును సరిదిద్దుకొని, అసత్య పూరిత వీడియోలను తీసివేస్తున్నామని తెలిపిన పలు మీడియా సంస్థలు.

కేవలం ఒక కుట్రలో భాగంగా, ఎజెండాలో భాగంగా తమపై జరుగుతున్న ప్రచారాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామన్న కేటీఆర్.

తమకు సంబంధం లేని విషయాలలో, తమ పేరును, ఫోటోలను ప్రస్తావిస్తున్న ప్రతి ఒక్క మీడియా సంస్థ యూట్యూబ్ ఛానల్ పైన న్యాయపరమైన చర్యలతో పాటు పరువు నష్టం కేసులు వేస్తామని హెచ్చరించిన కేటీఆర్.

ఈరోజు మరో 10 సంస్థలకు నోటీసులు పంపిన కేటీఆర్.

కేవలం తనను, తన కుటుంబాన్ని బదనాం చేయాలని కుట్రలో భాగంగా అసత్య ప్రచారాలను, కట్టు కథలను ప్రచారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్ళతో పాటు యూట్యూబ్ మరియు సోషల్ మీడియా సంస్థలకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు లీగల్ నోటీసులు పంపించారు. కేవలం తనకు, తమ కుటుంబానికి నష్టం కలిగించాలన్న దురుద్దేశంతోనే ఈ చానళ్ళు, మీడియా సంస్థలు, పక్కా ప్రణాళిక ప్రకారం ఈ దుష్ప్రచారాన్ని చేస్తున్నాయని కేటీఆర్ తన లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఇవన్నీ కూడా ఒక పక్కా ఏజెండాలో భాగంగానే మీడియా ముసుగులో ఈ కుట్రలు చేస్తున్నాయన్నారు. అసలు తమకు సంబంధమే లేని అనేక అంశాల్లో తమ పేరును, తమ ఫోటోలను వాడుకుంటూ అత్యంత హీనమైన తంబ్ నెయిల్స్ పెడుతూ పబ్బం గడుపుతున్న ఈ ఛానళ్లపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
కేవలం ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేయాలన్న కుట్రలో భాగమైన వీరందరు చట్ట ప్రకారం శిక్ష ఎదుర్కొనక తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పటికైనా తమకు, తమ కుటుంబానికి సంబంధంలేని అంశాలలో దుర్మార్గపూరిత ప్రచారం చేస్తూ, పెట్టిన వీడియోలను వెంటనే తొలగించాలని వారికి పంపిన లీగల్ నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి అసత్యపూరిత అంశాలను వెంటనే తొలగించుకుంటే మరిన్ని చర్యలు కూడా తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. కేవలం కొందరు వ్యక్తులు నడిపే యూట్యూబ్ ఛానల్ తో పాటు కొన్ని మీడియా సంస్థలు కూడా పక్కా ప్రణాళిక ప్రకారం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఇలాంటి వాటికి లీగల్ నోటీసులు పంపించామని కేటీఆర్ తెలిపారు.

అయితే కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్ ఇప్పటికే జరిగిన తమ తప్పును సరిదిద్దుకొని, ఇలాంటి వీడియోలను, కంటెంట్ను తీసివేసినామని చెబుతూ స్పందించినట్లు కేటీఆర్ తెలిపారు. వారం రోజుల్లోగా మిగిలిన మీడియా ఛానళ్లు, యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటి కంటెంట్ ని తీసివేయకుంటే మరిన్ని న్యాయపరమైన చర్యలు చేపడతామన్నారు. ఇకపైన తమకు, తమ పార్టీకి సంబంధం లేని అంశాలపైన అడ్డగోలు ప్రచారం, అసత్య ప్రచారం చేసే ప్రతి ఒక్క మీడియా సంస్థ, యూట్యూబ్ ఛానల్స్ పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, ఈ విషయాన్ని గుర్తించాలని కేటీఆర్ తెలిపారు. కేవలం ఆయా సంస్థలకే కాకుండా నేరుగా యూట్యూబ్ కి సైతం లీగల్ నోటీసులు పంపించామని కేటీఆర్ తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్. బిఆర్ఎస్.ఇరు పార్టీల వారిని గ్రామపంచాయతీ

Read More »

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం”

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం” ​-నా గ్రామ పంచాయతీ మండలంలో ఆదర్శంగా ఉండాలి -లలిత నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 05: ​భద్రాద్రి

Read More »

సర్పంచ్ గా గెలిపిస్తే రమంతపూర్ గ్రామని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

** కాంగ్రెస్ అభ్యర్థి వర్గంటి అనిత గణేష్. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున

Read More »

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. వేద విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేత. వేద పాఠశాలకు సేవలందిస్తా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా లోని సత్యసాయి

Read More »

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం.

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మండలం తాటిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి జవ్వాజి అశ్విని

Read More »

తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ

*తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా వెల్దుర్తి

Read More »

 Don't Miss this News !