★యుద్దానికి సిద్ధంగా ఉండండి
★సోషల్ మీడియాలో మల్లు నందినమ్మ అనుచరుల పోస్ట్
★సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ పై చర్చ.
నేటి గద్దర్ న్యూస్,ఉమ్మడి ఖమ్మం ప్రతినిధి:
కాంగ్రెస్ సైనికులారా సమరానికి సిద్ధం కండి…ఖమ్మం జిల్లా అభివృద్ధికై..నందినమ్మ విజయానికై…అడుగులో అడుగేద్దాం..అభివృద్ధికి బాటలేద్దాం..మరో ప్రజా ప్రస్థానానికి నాంది పలుకుదాం..మల్లు నందినమ్మ విజయానికి పాటుపడదాం..కాంగ్రెస్ కార్యకర్తలారా… నందినమ్మకే ఖమ్మం కాంగ్రెస్ టికెట్…అలుపెరగని యుద్ధానికి అందరం ఐక్యంగా కలిసి కదులుదాం…నందినమ్మకు బాసటగా నిలుద్దాం..రాహుల్ గాంధీని ప్రధాని ని చేద్దాం..అంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సైన్యం సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. బుధవారం ఢిల్లీలో జరగనున్న సిడబ్ల్యూసి సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిలు ఢిల్లీకి వెళ్లారు. కచ్చితంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ మల్లు నందిని కి వస్తుందని గంపేడంత ఆశతో ఆమె అభిమానులు ఉన్నారు. మరికొన్ని గంటలలో ఈ ఉత్కంఠతకు తెరపడనుంది.