+91 95819 05907

బూటకపు పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించండి : భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్) భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ (బీకే- ఏఎస్ఆర్)

★బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు భారతీయ జనత పార్టీని తన్ని తరమండి

★బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు బిజెపితో అంటకాగే పార్టీలన్నింటినీ తన్ని తరమండి.

★సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలను అమలు చేస్తున్న రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను తన్ని తరమండి
★ ప్రతిపక్ష పార్టీలను నిలదీయండి

★భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్) భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ (బీకే- ఏఎస్ఆర్)

నేటి గద్దర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
75 ఏళ్ళు దాటిన స్వతంత్ర దేశంలో ఎన్నికలు పేదల బతుకులు ఏమి మార్చాయో. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పేదలకు ఏమి మేలు వేసిందో పాలకు లు చెప్పాలని సిపిఐ మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం మావోయిస్టు ఆజాద్ పేరుమీద ఒక లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును దుయ్యబట్టారు. పెట్టుబడి దారులు, సాధూజ్యవాద ఏజెంట్లు ఎన్నికల్లో గెలిచి లేక్కలేనన్ని కోట్లు ఆస్తి పాస్తులకు కూడ బెట్టుకునేందుకు ఈ ఎన్నికలు పనికి వచ్చాయే తప్ప ప్రజల కష్టాలు, సమస్యలు పరిష్కరించి దేశం అభివృద్దికి ఏమాతం ఉపయోగపడలేదప్ప నగ్నసత్యం ప్రజలు గమనించాలి అని అన్నారు. ఈ క్రమంలో మళ్ళీ కల్లబొల్లి మాటలు, అమలు కానీ హామీలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ వైఎస్ ఆర్, టీడీపీ పార్టీలు ప్రజల వద్దకు ఓట్టడిగేందుకు వస్తున్నాయి. ఈ బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. దేశంలో, రాష్ట్రాల్లో ప్రజల శ్రమను దోపిడి చేస్తూ అవినీతికి పాల్పడి సంపాదించిన డబ్బుతో ఓట్లు కొనుక్కునే పార్టీలు ఉన్నంత కాలం దేశం బాగుపడడు. వేలకోట్ల రూపాయలు సంపాదించిన పార్లమెంట్ నాయకులు తమ ఆస్తులను సంపద లక్షల కోట్ల దేశ రాష్ట్రాల సంపద దోపిడిదారులకు కార్పొరేట్లను అందాలమెక్కించే పనిలో రాజకీయాలు బీజీగా ఉన్నాయి. ఎన్నికలలో వారు ఇస్తున్న హామీలు అన్ని నీటి బుడగలు గానే తేలిపోతున్నాయి. సోషల్ మీడియాను తమ గుప్పిట్లో ఉంచుకొని దేశంలో, రాష్ట్రాలలో లలో ప్రజల భూమి, తాగునీరు, విద్య వైద్యం నిమిుద్యోగం ఆకలి సమస్యల పరిష్కార చేయకుండానే మరోవైపు ఆర్థిక సంక్షోభం తాండవస్తుంటే సమస్యలు పరిష్కారం అయినట్లుగానే మీడియా బ్రమింప చేస్తున్నారు. మరోవైపుగా సహజ వనరులను దోచి పెట్టడానికి వేలకోట్ల అతికి పాల్పడుతున్న కేంద్రంలో పరేంద్ర మోడీ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను ఎవ్వరు పట్టించుకోరు వారి దేశ భక్తులుగా పూజించే పరిస్థితిని మీడియా కల్పిస్తుంది. వీరు గత 60 సంవత్సరాలుగా పరిపాలనలో దేశంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో జగన్, కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి లు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వాలు కొనసాగించిన విధానాలు దేశ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అసంతృప్తిని రేకెత్తిస్తుంది. ప్రజాస్వామ్యం అనేది లేకుండా మత ఉన్మాద ఎజెండా ప్రజలను విభజన గురిచేస్తూ ప్రజా సంక్షేమాన్ని ప్రక్కకు పెట్టి కార్పొరేట్ బూర్జువా సామ్రాజ్యవాద వద్ద ప్రయోజనాల కోసం పాటుపడుతూ ప్రశ్నించే ప్రజలను ఉద్యమకారులను రచయితలను అన్నభ తేడా లేకుండా అణివివేయడం జరుగుతుంది.

ప్రతిపక్షాలను సైతం అనేక సాకులతో వేధింపులకు గురిచేస్తుంది. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వానికి అడ్డు తగలకుండా చేస్తే ప్రభుత్వాలు రాష్ట్రంలోని ప్రతిపక్షాలపై ప్రజా సంఘాలపై పౌర హక్కుల పై దాడి వేస్తున్నాయి. ప్రజలను పట్టించుకోకుండా పాజా చేస్తాం అని బహిరంగంగా ప్రకటిస్తున్నాయి. మరోవైపు ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న మావోయిస్టు పార్టీపై సూరజ్ కుండ్ వ్యూహాత్మక దాడికి పాల్పడుతుంది. మావోయిస్టు పార్టీపై, విప్లవ ప్రజా సంఘాలపై, విప్లవ ప్రజాస్వామ్య ప్రగతిశీల సంస్థలపై, మత మైనారిటీ పీడిత బాదుల సంస్థలపై నిషేధాన్ని విధించి ఉపా వంటి నిర్బంధ చట్టాలను విధించి ఎన్ఐఏ దాడులుచేపిస్తుంది. మరోపక్క ఉద్యమ ప్రాంతాలలో పారా మిలిటరీ కమాండో క్యాంపులను వేసి ప్రజలపై మహిళలపై దాడులు అత్యాచారాలు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా కార్మిక కర్షక మధ్యతరగతి మహిళ దళిత ఆదివాసి మత మైనారిటీ విద్యార్థి యువజన మేధావులపై సకల పీడిత ప్రజలపై బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు దాడులు కొనసాగిస్తున్నాయి.

**మావోయిస్టు పార్టీ బహిరంగ లేఖలో పేర్కొన్న అంశాలు ఇవే**

* బూటకపు ఎన్నికలను బహిష్కరించండి బ్రాహ్మణీయ హిందుత్వ పాసిస్టు BJP పార్టీని తన్ని తరమండి.

* బ్రాహ్మణీయ హిందుత్వ పాసిస్టు బిజెపికి అంటకాగే పార్టీలన్నింటినీ తన్ని తరమండి.

* సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలను అమలు చేసే ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించండి.
* ఓట్ల కోసం వచ్చే ఇతర ఎన్నికల పార్టీలను నిలదీయండి. విప్లవ ప్రజా అధికార సంస్థలను నిర్మాణం చేద్దాం కాపాడుకుందాం బలోపేతం చేద్దాం.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్. బిఆర్ఎస్.ఇరు పార్టీల వారిని గ్రామపంచాయతీ

Read More »

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం”

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం” ​-నా గ్రామ పంచాయతీ మండలంలో ఆదర్శంగా ఉండాలి -లలిత నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 05: ​భద్రాద్రి

Read More »

సర్పంచ్ గా గెలిపిస్తే రమంతపూర్ గ్రామని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

** కాంగ్రెస్ అభ్యర్థి వర్గంటి అనిత గణేష్. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున

Read More »

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. వేద విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేత. వేద పాఠశాలకు సేవలందిస్తా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా లోని సత్యసాయి

Read More »

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం.

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మండలం తాటిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి జవ్వాజి అశ్విని

Read More »

తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ

*తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా వెల్దుర్తి

Read More »

 Don't Miss this News !