*ఖమ్మం జిల్లాకు అన్నపూర్ణలా వెలుగొందిన పాలేరు చెంత ఎండిన పొలాలు..*
*బీర్ఎస్ జిల్లా అధ్యక్షులు తాతా మధు ఆధ్వర్యంలో రైతుల చెంతకు బీఆర్ఎస్ బృందం*
*వరప్రధాయనిలా నిండుకుండలా కళకళలాడాల్సిన పాలేరులో పల్లేర్లు*
*సాగర్ జలాలు విడుల చేసి రైతులను, ఎండిపోతున్న పంటలను కాపాడాలని బీఆర్ఎస్ డిమాండ్*
*బీఆర్ఎస్ ముఖ్యనేతలకు తమ గోడు వెళ్లబోసుకున్న కర్షకులు*
*నేటి గద్దర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ద విధానాలతో ఖమ్మం జిల్లాను ఏడు దశాబ్దాలుగా పచ్చని పంటలతో కళకళలాడేలా, ఉమ్మడి జిల్లాలో హరిత విప్లవానికి నాంది పలికిన *పాలేరు జలాశయంలో పల్లేర్లు* మొలిశాయనీ కండ్ల ముందు ఎండిపోతున్న పంటలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందనీ.. ఇకనైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో *పాలేరుకు సాగర్ జలాలు అందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలనీ, తాగునీటికోసం ప్రజలకు నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఆదివారం వివిధ మండలాల్లో పర్యటించింది.* అన్నపూర్ణలా వెలుగొందిన పాలేరు నేడు కాంగ్రెస్ పుణ్యమాని క్రీడా మైదానాన్ని తలపిస్తోందనీ, *జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి ఏం ప్రయోజనమని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం మండిపడింది.* బీఆర్ఎస్ పార్టీ *జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ ఆధ్వర్యంలో* ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య, మదన్‌లాల్, చంద్రావతి, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం తదితరుల బృందం ఆదివారం పాలేరు నియోజకవర్గంలోని పాలేరు రిజర్వాయర్, నేలకొడపల్లి మండలంలో ఎండిపోయిన పంటలను పరిశీ లించింది. తొలుత పాలేరు రిజర్వాయర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ, బీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ గతేడాది ఇదే సమయంలో కళకళలాడుతున్న రిజర్వాయర్ ఈసారి డెడ్ స్టోరేజీ లెవల్‌కు పడిపోవడానికి ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడమే కారణమన్నారు.
*ముగ్గురు మంత్రులుండి ఏం ప్రయోజనం..?*
ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండి ఏం ప్రయోజనమని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం మండిపడింది. రైతులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని, సాగునీరు అందిస్తామంటేనే యాసంగి పంటలు రైతులు వేసుకున్నారని, ఒకటి, రెండు తడులు ఇచ్చినా జిల్లాలో వేలాది ఎకరాల పంట చేతికి వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ఎకరానికి రూ.30 వేలు చొప్పున పంట నష్టపోయిన రైతులకు చెల్లించాలని ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ డిమాండ్ చేశారు. అనంతరం నేలకొండపల్లి మండలంలోని సింగిరెడ్డిపాలెంలో ఎండిపోయిన రైతుల పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ ఆవేదనను, ఆందోళనను పార్టీ నేతలముందు వెలిబుచ్చారు. బోదులబండకు చెందిన ధనమూర్తి అనే రైతు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసి తప్పుచేశామని, మూడునెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వ అసలు రంగు బయటపడిరదని, రైతులను కనీసం ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయడంలేదని తాము ఐదెకరాల్లో వేసిన వరి పూర్తిగా ఎండిపోయిందన్నారు. గతంలో ఈ తరహా దుర్భర పరిస్థితులు ఈ ప్రాంత రైతులు ఎప్పుడూ ఎదుర్కొనలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న భ్రమలు తొలగిపోయాయని అన్నారు. బీఆర్ఎస్ ప్రతినిధి బృందం రైతును ఓదార్చి పార్టీ అండగా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ వైఖరి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండగా ఉంటారని వారి సమస్యలను పరిష్కరించేందుకు పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ వారికి ధైర్యం చెప్పి బీఆర్ఎస్ రైతుల తరఫున పోరాటానికి సిద్ధంగా ఉందని, సాగర్ నీటితో పాలేరు జలాశయాన్ని నింపే వరకూ ఊరుకునేదిలేదని, అలాగే రైతుబంధు వేస్తామని రైతులను మభ్యపెట్టడం తప్ప ఇప్పటివరకు అనేకమంది రైతులకు వేయలేదని పలువురు రైతులు మధుకు వివరించారు. రైతు సమస్యలపై తాము పోరాడుతామని, రైతుబంధు పడేంతవరకూ ప్రభుత్వంపై వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, డాక్టర్ బానోత్ చంద్రావతి, మదన్‌లాల్, మెచ్చా నాగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, వెంకటరమణ, మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు, వేముల వీరయ్య, ఉన్నం బ్రహ్మయ్య, పాషబోయిన వీరన్న, కార్యదర్శి ఆసీఫ్ పాషా, నాయకులు మల్లీడి వెంకన్న, చాట్ల పరశురాం, జర్పులా బాలాజీ, ఆర్మీ రవి, మట్టా వెంకటేశ్వర్లు, కిషన్, రాయభారపు రమేశ్, కాసాని సైదులు, ఉపేంద్రాచారి, బాలకృష్ణ, రంజాన్ తదితరులు పాల్గొన్నారు.