★కడియం శ్రీహరి ఇంటి ముందు మాదిగలం చావు డప్పు కొడతాం
నేటి గద్దర్ న్యూస్,హైదరాబాద్:
మాదిగలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి చావు డప్పు కొడతాం అని మాజీ ఎమ్మెల్యే ,BRS రాష్ట్ర నాయకులు రసమయి బాలకిషన్ ఘాటు వాక్యాలు చేశారు. ఆయన మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన
కడియం శ్రీహరి అనే వాడు మాదిగ ద్రోహి అన్నారు.
రాజయ్య, అరూరి రమేష్, పసునూరి దయాకర్ లాంటి వారిని పార్టీ నుండి వెళ్లిపోయే దాకా వెంటపడ్డాడు.
కడియం శ్రీహరి అనేవాడు మాల, మాదిగ రెండూ కాదు ఎటూకాని వాడు అని అన్నారు.కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. మాదిగలను కించపరిచిన కాంగ్రెస్ పార్టీకి చావు డబ్బు కొడతామని అన్నారు.
Post Views: 80