★ దళిత బంధు ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో దళిత సోదరులు ఆలోచన చేయాలి
★ తెలంగాణ ప్రజలకు కరెంటు తాగునీటి కష్టాలు ఎందుకొచ్చాయి?
★ తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి?
★ పార్లమెంట్ ఎన్నికలలో ఖమ్మం మహబూబాద్ MP సీట్లు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది.
★BRS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు REGA Kantharao
నేటి గద్దర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలలో ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలను BRS పార్టీ గెలుస్తుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆయన గురువారం సోషల్ మీడియా వేదికగా అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను విమర్శిస్తూ పలు పోస్టులు పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధకులు, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారం నుండి దిగిపోగానే దళిత బంధు ఎందుకు ఆగిపోయిందో దళిత సమాజం ఆలోచన చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వేల ఎకరాలను ఎందుకు పంట నష్టం వాటిల్లిందని, కరెంటు కష్టాలు, తాగునీటి కష్టాలు ఎందుకు ఉత్పన్నం అయ్యాయి ప్రజలు ఆలోచన చేయాలని REGA విజ్ఞప్తి చేశారు. అతి తక్కువ సమయంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకత మూటగట్టుకుందని, ప్రజలే రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు.
