★ ఛైర్మెన్ గా లేళ్ళ. అప్పిరెడ్డి
★ప్రధాన కార్యదర్శి గా వెలగ తిరుపతిరావు ఏకగ్రీవ ఎన్నిక నేటి గధర్ న్యూస్:జూలూరుపాడు మండల పరిధిలోని పడమట నరసాపురం గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం నూతన కమిటీ చైర్మెన్ గా లేళ్ళ.అప్పిరెడ్డిని ప్రధాన కార్యదర్శి వెలగా. తిరుపతిరావును రామాలయ అభివృద్ధి గ్రామ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ రామాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, హిందూ సాంప్రదాయ పండుగలను అందరి సహాయ సహకారాలతో వైభవంగా కొనసాగిస్తానని అన్నారు తనపై నమ్మకంతో ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాజా.రమేష్, లేళ్ళ. రామిరెడ్డి, ఆళ్ల. శ్రీనివాసరావు, నాగ. బిక్షపతి రావు, కొదుమూరి మల్లికార్జునరావు, కోటేరు సత్యనారాయణరెడ్డి, బాదావత్.రామకోటి, గ్రామస్తులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
