+91 95819 05907

ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల ఆగడాల పై CPI ML mass line ఆగ్రహం

●పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు ఫైనాన్స్ దోపిడీ దందాలు

*●100 కు 7రూపాయలు,10,000 వేలకు 12,000 వేల రూపాయలు, ఒక లక్ష కు 6500 రూపాయలని అధిక వడ్డీ లు గుంజుతున్న డైలీ వీక్లీ మంత్లీ ఫైనాన్స్ దందాలు
● ఆర్ధిక దోపిడికి మానసిక హింసకూ గురి అవుతున్న ఏజన్సీ వాసులు, పేదలు,చిరు వ్యాపారస్తులు, ప్రైవేటు ఉద్యోగస్తులు
● అత్యసకు పోయి అధిక వడ్డీ వసూలు చేస్తే బాధితులను ఐక్యం చేసి పోరాటం చేస్తాం

●అధికారులు స్పందించి ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న ప్రైవేటు వడ్డీ వ్యాపారలను కట్టడి చేయాలి

●CPI(ML) మాస్ లైన్ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్

నేటి గద్దర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
భద్రాచలం పట్టణ కేంద్రంలోని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యాలయంలో శనివారంజనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ మాట్లాడుతూ భద్రాచలం డివిజన్లో చర్ల దుమ్ముగూడెం భద్రాచలంలో ప్రైవేటు వ్యాపారస్తుల ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయని అన్నారు. పట్టణ స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు ఈ వడ్డీదంతా కొనసాగుతుందని అన్నారు. పేద ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని వారి రక్తాన్ని ఫైనాన్స్ వ్యాపారులు జలగల పీలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరు వ్యాపారస్తులైన తోపుడు బండ్లు ,చాటు, చికెన్, చిల్లర దుకాణాలు, ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకొని ఈ వ్యాపారం కొనసాగుతుందనీ అన్నారు. తమ వద్దకు అప్పుకు వచ్చేవారి అవసరాలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వడ్డీ వసూలు చేస్తున్నారనీ చిరు వ్యాపారస్తులు తోపుడుబండ్ల నిర్వాహకులు ఏరోజుకారోజు జరిగే వ్యాపారం మీద ఆధారపడి జీవిస్తుంటారు. పెట్టుబడుల కోసం డైలీ ఫైనాన్స్ వారిని ఆశ్రయిస్తూ ఉంటారు ఉదయం 900 ఇస్తే సాయంత్రానికి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు అంటే రోజుకి ఒక్కొక్కరిపై 100 రూపాయలు వసూలు చేస్తున్నారనేది అర్థమవుతుంది. మరికొందరు 9000 రూపాయలు ఇచ్చి ఒక్క వారంలో పదివేల రూపాయలు రూపాయలు వసూలు చేస్తున్నారు దీన్నిబట్టి చూస్తే ఈ దందా ఏ స్థాయిలో జరుగుతుందనేది అర్థమవుతుంది. సకాలంలో వడ్డీ అప్పు కట్టకపోతే వారి ఇంటిని భూమిని వాహనాలను తనకా పెట్టుకుంటున్నారు ఈ వ్యాపారం పూర్తిగా చట్ట విరుద్ధమైనటువంటిది. అయినప్పటికీ ఇంత జరుగుతున్న అధికారులు ఏమి పట్టనట్టు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇది అత్యంత ధారణంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ పరిగణిస్తుంది వెంటనే అధికారులు స్పందించి చట్టం విరుద్ధంగా నడుస్తున్న ఈ ఫైనాన్స్ వడ్డీ వ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. లేనియెడల కచ్చితంగా బాధిత ప్రజల తరఫున పోరాటం నిర్వహిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ నాయకులు దాసరి సాయన్న కొండ కౌశిక్ చన్న0 మోహన్ రాజు, వీరన్న తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఏసీబీ అలజడి

వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలు, అక్రమ చెలామణీలపై పలువురు చేసిన ఫిర్యాదులు ఈ దాడులకు కారణమయ్యాయి. ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు

Read More »

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు.

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల కేంద్రంలోని మాజీ వైస్ ఎంపీపీ బండి రత్నాకర్ చనిపోయి నేటికి 20

Read More »

జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్ర చిన్నపిల్లలకు ఆదర్శం కావాలి.

మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు. నేటి గదర్ న్యూస్,,చింతకాని ప్రతినిధి: భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రు జీవిత చరిత్ర చిన్నపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని మతికేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు కోరినారు.

Read More »

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు వేషధారణలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.

Read More »

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది ◆ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు:మంత్రి పొంగులేటి

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది. ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు.. దశాబ్దకాలం జరిగిన విద్వంసాన్ని చక్కదిద్దే కాంగ్రెస్ పైనే ప్రజల నమ్మకం. ప్రజా పాలన, సంక్షేమం, అభివృద్ధి

Read More »

నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్.

వైరా నియోజకవర్గం కేంద్రంలో పేదలకు అందని ప్రభుత్వ వైద్యం నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్. వంద పడకల హాస్పిటల్ గా అఫ్ గ్రేడ్ చేసినా సరైన వైద్యం అందటం

Read More »

 Don't Miss this News !