+91 95819 05907

నెత్తుటి బాకీ తీర్చుకుంటామని ప్రకటించారు.బూటకపు ఎన్ కౌంటర్లకు కాంగ్రెస్ ,CM రేవంత్ బాధ్యత వహించాలి

🔥 ములుగు ఎస్పీ కనుసన్నల్లోనే ఈ ఎన్ కౌంటర్ల పరంపర

🔥 పూజార్ కాంకేర్ మృతులకు లాల్ సలాం
🔥మావోయిస్టులపై అటు తెలంగాణ. ఇటు చత్తీసద్ మహారాష్ట్ర పోలీసులు రాజ్యహింసకు తెగబడుతున్నారు
🔥ఆదివాసీ ఉద్యమాలను రాక్షసంగా అనగదొక్కు తున్నారు
🔥భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్)భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ (బీకే-ఏఎస్ఆర్)
నేటి గద్దర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:బూటకపు ఎన్ కౌంటర్లకు కాంగ్రేసే బాధ్యత వహించాలని మావోయిస్టు పార్టీ శనివారం ఆజాద్ పేరు మీద ప్రకటన విడుదల చేసింది.
ఏ పార్టీ అధికారంలో ఉన్న రాజ్యం స్వభావం మారదని, ప్రజల కోసం పోరాడుతున్న మావోయిస్టులపై అటు తెలంగాణ. ఇటు చత్తీసద్ మహారాష్ట్ర పోలీసులు రాజ్యహింసకు తెగబడుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు .కార్పోకేట్ కంపనీల అడుగులకు మరుగులొత్తేలా వారు పనిచేస్తున్నారు. ఈ హింసలో పార్టీలది ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని పార్టీ లది ఒకటే వ్యూహం, ఒకటే దారి. మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యం తో పనిచేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నా పాలించే విధానంలో ఎలాంటి మార్పూ లేదని అన్నారు.అదివాసీ ప్రాంతాల్లో ఉన్న విలువైన ఖనిజాలు, వనరులను పెద్ద పెద్ద కంపనీలకు, సామ్రాజ్య వాద తొత్తులకు గుండుగుర్తగా తాకట్టు పెట్టే క్రమంలో అక్కడ ఉన్న ఆదివాసీ ఉద్యమాలను రాక్షసంగా అనగదొక్కు తున్నారు. దండకారణ్యం అంతా పోలీసు ర్యాంపులతో విలపిస్తున్నాయి. ఓ పక్క డ్రోన్లు, హెలీకాప్టర్లలో ఆకాశ మార్గంగుండా దాడులు వేస్తున్నారు. ఇటీవల కాలంలో మహారాష్ట్ర సరిహద్దులో ముగ్గురు కామ్రేడ్స్ పై విష ప్రయోగం చేసి పట్టుకొని అతి కిరాతకంగా హింసించి ఎస్ కౌంటర్ కథంల్లారు. ఈ రోజు బీజాపూర్ జిల్లా డిసూర్ బ్లాక్ పూజారికాంకేర్ తెలంగాణ గ్రేహౌండ్స్ స్పెషల్ పార్టీ. కోలా పోలీసులకి ,మావోయిస్టులకు మధ్య జరిగిన భయంకర యుద్ధంలో మా కామ్రేడ్స్ ముగ్గురు అమరులయ్యారని తెలిపారు. తెలంగాణ ఎస్ జెడ్పీ సభ్యులు కామ్రేడ్ సాగర్ తో పాటు కామ్రేడ్ మణిరాం (ఏపీఎం) మరో కామ్రేడ్ ముగ్గురూ అమరులయ్యారు. వారికి మావోయిస్టు పార్టీ విప్లవ జ్యోహార్లు అర్పిస్తుంది. వారి పోరాట పటిమను కొనియాడుతూ వారికి లాల్ సలామ్ తెలుపుతుంది. వారి ఎన్ కౌంటర్ కారకులైన ములుగు ఎస్సీ. పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా పరిపాలించిన కేసీఆర్ మావోయిస్టు ఎజెండానే తన తండాలని అధికారం చేపట్టాక మావోయిస్టు నిర్మూలించడానికి ఒక నియంతగా వ్యవహరించాడు. అదే తరహాలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కులను పరిరక్షిస్తానని ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతానని చెప్పి మావోయిస్టు పార్టీపై తన పోలీసు బంగాంతో దాడులు చేసిస్తూ పాలించే వాళ్ళంతా ఒకే గూటి పక్షులని రాజ్యహింసలో ఒకడిని మంచిన వాడు ఇంకొకడు అన్నట్లు కార్పోరేట్ ఏజెంట్లే పని రుజువు చేసుకున్నడు. ఈ ఎన్కౌంటర్లకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డిదే పూర్తి బాధ్యత అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో మా కామ్రేడ్స్ పై ములుగు జిల్లా ఎస్సీ పథకం రచించి ఈ ఎన్ కౌంటర్ కు పాల్పడ్డాడు. తప్పకుండా ఈ ఎన్కౌంటర్ కు నెత్తుటి బాకీ తీర్చుకుంటామని ప్రకటించారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !