తుక్కగుడా కాంగ్రెస్ జన జాతర సభాస్థలిపై భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా.తెల్లం
నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంటుందని మంగమ్మ శబదం చేశాడు. శనివారం అది నెరవేరింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భద్రాచలం నియోజకవర్గం మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు విజయకేతనం ఎగరవేశారు. పాత సెంటిమెంటును కొనసాగిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం BRS కైవసం చేసుకుంది. బీ ఆర్ఎస్ పార్టీకి ఉన్న ఓకే ఒక MLA డాక్టర్ తెల్లం వెంకట్రావు తుక్కగుడా కాంగ్రెస్ జన జాతర సభ వేదికపై కనిపించారు. . ఇదివరకే పలు కాంగ్రెస్ కార్యక్రమాల్లో సైతం డాక్టర్ తెల్లం కనిపించారు. శనివారం తుక్కుగూడ కాంగ్రెస్ పార్టీ సభస్థలపై మరోమారు డాక్టర్ తెల్లం కనిపించడంతో ఇన్ని రోజుల సస్పెన్షన్ కి తెర పడినట్లు అయింది. దీనితో పొంగిలేటి 10/10 శబదం నెరవేరినట్లు అయిందని కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు.