నేటి గద్ధర్ వెబ్ డెస్క్:
భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోర్లు వేసి లక్షల్లో అప్పుల పాలై ఉరి వేసుకుని చనిపోతున్న రైతులు.
తెలంగాణలో గత నాలుగు నెలల్లోనే 220కి పైగా రైతులు మృతి చెందగా ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవట్లేదు అంటూ బుకాయిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంత గ్రామానికి చెందిన బాంచ మహేందర్ (35) తనకున్న 2 ఎకరాల పొలంలో వరి సాగు చేస్తూ ఉన్న బోరు ఎండిపోయి కొత్త బోరు వేసి సాగు కోసం రూ. 3 లక్షల అప్పులు చేసి తీవ్ర మనోవేదనకు గురై పక్కన ఉన్న రేకుల షెడ్డులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మహబూబ్‌నగర్ జిల్లా మద్దిగట్ల గ్రామానికి చెందిన కొత్త కుర్వ శ్రీశైలం (30) తనకున్న రెండెకరాల పొలంలో బోరు ఎండిపోవడంతో రూ. 1.50 లక్షలు ఖర్చు చేసి రెండు బోర్లు వేశాడు. మొత్తంగా పెట్టుబడి కోసం రూ. 6.50 లక్షల వరకు అప్పు చేరడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.