★చింతలపాడు గొత్తి కోయ గ్రామంలో వైద్య శిబిరం
★ వడదెబ్బ నివారణకు సూచనలు
★ పలువురు రోగులకు వైద్య పరీక్షలు. ఉచిత మందులు అందజేత.
★పినపాక PHC సంచార వైద్యులు అనిల్ కుమార్
నేటి గద్ధర్ న్యూస్,పినపాక నియోజకవర్గ ప్రతినిధి:వడదెబ్బ ప్రాణం తీస్తుంది. జాగ్రత్తలు పాటించాలి అని పినపాక PHC సంచార వైద్యులు అనిల్ కుమార్ సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మారుమూల చింతలపాడు గొత్తి కోయ గ్రామంలో. శనివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులను పరీక్షించారు. మందులు అందజేశారు. అనంతరం ఆరోగ్యం కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి పలు సూచనలు చేశారు. వేసవికాలంలో ఉష్ణతాపం పెరగడంతో వడదెబ్బ నివారణకు పాటించవలసిన జాగ్రత్తలు వివరించారు.ఎండలో ఎక్కువగా తిరగరాదు.తగినన్ని నీళ్ళు తాగాలి.వేసవికాలంలో వదులైన నూలు దుస్తులు ధరించాలి.కారం, మసాలా పదార్థాలు తినడం తగ్గించాలి.ధ్యానం లేదా యోగాను ప్రాక్టీస్ చేయండి. తగినంత నిద్ర పొందండి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి అని ఎడ్యుకేట్ చేశారు. వడదెబ్బ బారిన పడిన వెంటనే ఆలస్యం చేయకుండా సమీప పీహెచ్సీలో వైద్యం చేయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ రాజ మనేశ్వరి, ANM కృష్ణవేణి, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.