★ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి
★ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10/10 కాంగ్రెస్
★పంతం నెగ్గించుకున్న పొంగులేటి
★ ద్వందనీతి పాటిస్తున్న కాంగ్రెస్ పార్టీ:BRS పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం
★ పొందేం వీరన్న కు ద్రోహం చేసింది ఆ పార్టీ వారేనా?
◆Mla డా. ఎల్లంపై అనర్హత వేటు వేయాలి:BRS భద్రాద్రి జిల్లా అధ్యక్షులు REGA Kantharao
నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు BRS పార్టీకి సవాల్ విసిరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ ని గెలిపించుకుంటానని శబదం పూనిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం తన పంతం నెగ్గించుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్న ఏకైక స్థానం భద్రాచలం సైతం కాంగ్రెస్ పార్టీ ఖాతాలో చేరింది. భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు CM రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు MLAడాక్టర్ తెల్లం వెంకట్రావు తెలిపారు. ఇది ఇలా ఉండగా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొందేం వీరయ్య ఓడిపోవడానికి ఆ పార్టీ నాయకులే కారణమయ్యారా అనే చర్చ జరుగుతుంది. ఒకవేళ పొందేం వీరయ్య గెలిచి ఉంటే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందని కుతంత్రంతో ఆ పార్టీలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ అగ్రకులాల వారు ఆదివాసి బిడ్డ పొందేం ఓటమికి కారణమయ్యారని ఆదివాసీలు ఆదివాసి సంఘాలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా మంత్రి పొంగులేటి మాత్రం తన పంతం నెగ్గించుకున్నారు.