★ పిలిసి పిల్లనిస్తే కులం తక్కువ అన్నాడట … అట్లా ఉంది తెల్లం పరిస్థితి
★భవిష్యత్తు లో MLA డా.తెల్లానికి కాంగ్రెస్ నుండి భంగపాటు తప్పదు
★ గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు తెల్లం కాంగ్రెస్ పార్టీని నమ్మాడు
★BRS కార్యకర్తలు ఎవరు అధైర్య పడకండి… నేను కాపాడుకుంటాను
★ భవిష్యత్తులో రానుంది కేసీఆర్ ప్రభుత్వమే
★BRS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు Rega Kantharao
నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: భద్రాచలం నియోజకవర్గం టికెట్ కు సంబంధించి డాక్టర్ తెల్లం వెంకట్రావుకు కాంగ్రెస్ అభ్యర్థిత్వం తిరస్కరిస్తే BRS పార్టీ టికెట్ ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టింది అని BRS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు Rega Kantharao ఆదివారం సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యే తెల్ల వెంకటరావుపై ఫైర్ అయ్యారు.పిలిసి పిల్లనిస్తే కులం తక్కువ అన్నాడట అనే చందంగా తెల్లం పరిస్థితి ఉందన్నారు.భవిష్యత్తు లో MLA డా.తెల్లానికి కాంగ్రెస్ నుండి భంగపాటు తప్పదు అని హెచ్చరించారు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు Drతెల్లం కాంగ్రెస్ పార్టీని నమ్మాడని… ఆయన రాజకీయ జీవితం కి చివరి ఘడియలు అని అన్నారు .BRS కార్యకర్తలు ఎవరు అధైర్య పడకండి… నేను కాపాడుకుంటాను అని BRS కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో రానుంది కేసీఆర్ ప్రభుత్వమే గంటా పథంగా చెప్పారు.
