*ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సభ్యులు షేక్ సోందుపాషా*
*పేద ముస్లింలకు రంజాన్ తోఫాలు పంపిణీ*
*రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడి*
నేటి గద్దర్ కరకగూడెం: సమాజంలోని పేదలకు సేవ చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు ‘ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్
సికింద్రాబాద్’ సభ్యులు,కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా పేర్కొన్నారు.ఈ మేరకు ఆయన ఆదివారం మండల కేంద్రంలోని తన నివాసంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన సుమారు 50 కుటుంబాలకు రంజాన్ పండుగను పురస్కరించుకుని సేమియాలు,పాలు ఇతరత్రా పదార్థాలతో కూడిన రంజాన్ తోపాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముస్లింలు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో కఠిన ఉపవాస దీక్షలు చేస్తూ అల్లాహ్ కృపకు పాత్రులవుతారని అన్నారు.అంతేకాకుండా పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షింస్తూ తోపాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.అలాగే ప్రజల అవసరాలను గుర్తించి రానున్న రోజుల్లో ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యుల,పలు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
