★తహశీల్దార్ నాగప్రసాద్
నేటి గద్దర్ న్యూస్, కరకగూడెం:ఇంటింటికీ తహశీల్దారు కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజు సోమవారం తాటి గూడెం, రఘునాధపాలెం,గ్రామపంచాయతి పరిధిలోని గ్రామాలలో కరకగూడెం తహశీల్దారు నాగప్రసాద్ ఇంటింటికీ తిరుగుతూ ఓటుపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ. ఇంటింటికీ తహశీల్దార్ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఓటుపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లలో ఓటు చైతన్యం తీసుకువచ్చి నూరు శాతం ఓటు లక్ష్యం గా ఈ కార్యక్రమం మండలంలోని 16 గ్రామపంచాయతిలో నిర్వహించడం జరుగుతుందని,ప్రజలనుండి మంచి స్పందన వస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్య భారతంలో ఓటు ప్రజల తలరాతను మార్చేదన్నారు . అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని తాసిల్దార్ సూచించారు. ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు రానున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు .ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది,నరేష్, కృష్ణ,గ్రామపంచాయతిల సిబ్బంది పాల్గొన్నారు.
