నేటి గద్ధర్ న్యూస్,జూలూరుపాడు:
(వైరా ): తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వైరా నియోజకవర్గంలో సోమవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా వైరా మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పణితి సైదులు తల్లి చనిపోయినందున వారి కుటుంబాన్ని, ఫిషరిష్ చైర్మన్ రహీంకు ఆపరేషన్ అయినందున అతన్ని పరామర్శించి ఓదార్చారు. ఏన్కూర్ మండలంలోని కేసుపల్లి గ్రామంలో శెట్టిపల్లి వెంకటేశ్వర్లు సోదరుని కుమారుడు చనిపోయినందున వారి కుటుంబాన్ని, కాలనీ నాచారంలో మాజీ ఎంపీపీ ముక్తి వెంకటేశ్వర్లు తండ్రి చనిపోయినందున వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. జూలూరుపాడు గ్రామంలో జరిగిన ముఖ్యనాయకుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు మాలోతు రాందాస్ నాయక్, తెల్లం వెంకట్రావ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాయల నాగేశ్వరరావు, బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, గోసు మధు, లేళ్ల వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.*
