నేటి గద్ధర్ న్యూస్, భద్రాచలం:
◆ఈ విషయంలో రేగా కాంతారావు,MLC తాత మధువ్యవహారం చూస్తుంటే గురువింద సమేత గుర్తు వస్తుంది
◆మీ తీరీ ప్రకారమే ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు కాంగ్రెస్ లో చేరడం న్యాయమే కదా
◆సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండ చరణ్
పార్టీ ఫిరాయింపుల గురించి బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం మాట్లాడటం సిగ్గుచేటని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా.చరణ్ అన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం.వెంకట్రావు బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయమై న్యాయపోరాటం చేస్తానని అంటున్న మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గతంలో తాను చేసిందేమిటో గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. 2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి అభివృద్ధి వంకతో గులాబీ గూటికి చేరిన రేగా కాంతారావు ఇప్పుడు డాక్టర్ తెల్లం.వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరితే రాద్ధాంతం చేయడం హాస్యాస్పదమని అన్నారు.ఎమ్మెల్సీ తాతా మధు, రేగా కాంతారావుల తీరు చూస్తుంటే గురివింద సామెత గుర్తుకు వస్తున్నదన్నారు.ఆనాడు రేగా కాంతారావు పార్టీ మారితే తప్పు కానిది నేడు తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. తాను చేస్తే సంసారం మరొకరు చేస్తే వ్యభిచారం అన్న చందంగా వారు మాట్లాడుతున్నారని అన్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బిఆర్ఎస్ పార్టీయేనని గుర్తు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే కారు ఖాళీ అవుతుందని బిఆర్ఎస్ నాయకత్వానికి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి నచ్చిన పార్టీలో వారు చేరవచ్చని తెలిపారు.