+91 95819 05907

జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి:ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్*

నేటి గద్దర్ న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:భద్రాద్రి జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాబోయే పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏజెన్సీ ప్రాంత పోలీస్ స్టేషన్లో పనిచేసే పోలీస్ అధికారులంతా మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ముఖ్యంగా తెలంగాణ-ఛత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల పోలీస్ స్టేషన్లలో పనిచేసే అధికారులు నిషేధిత సిపిఐ మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని తెలియజేసారు.అనంతరం ఏజెన్సీ ప్రాంత పోలీస్ స్టేషన్లలో నమోదైన పలు కేసుల వివరాలను మరియు అక్కడ ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.ఏజెన్సీ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు సందర్శిస్తూ సరైన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.జిల్లాలోని ఏజెన్సీ సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొని ఓటింగ్ శాతాన్ని పెంచేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్,ఇల్లందు డిఎస్పీ చంద్రభాను,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి మరియు ఏజెన్సీ ప్రాంత పోలీస్ స్టేషన్లలో పనిచేసే పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !