*భక్తి శ్రద్ధలతో ప్రార్ధనలు చేసిన ముస్లింలు*
*-జకాత్ పేరిట ప్రతి సంవత్సరం మాదిరిగానే పేదవాళ్లకు సాయం*
నేటి గద్దర్ న్యూస్,
కరకగూడెం: ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ పర్వదిన వేడుకలు గురువారం కరకగూడెం మండలంలో ఘనంగా జరిగాయి.మస్జిద్ లల్లో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు ప్రార్థనల్లో పాల్గొన్నారు.రంజాన్ రోజు ప్రత్యేకంగా పేద ప్రజలకు దానధర్మాలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని భావించి కొందరు ముస్లింలు పేదవారికి బట్టలు, బియ్యం దానం చేశారు.జకాత్ పేరిట ప్రతి సంవత్సరం పేదవాళ్లకు బట్టలు నిత్యావసర సరుకులు దానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. నెల రోజుల పాటు ప్రతి రోజు దానధర్మాలు చేయడం వల్ల తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని సంపూర్ణ దైవదర్శనం సిద్ధిస్తుందని ముస్లిం సోదరులు విశ్వసిస్తారు. ఉపవాస దీక్షను విరమించి, ప్రత్యేక ప్రార్ధనలు చేసి ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో ఉండాలని ముస్లిం సోదరులు ఆకాంక్షిం చారు. రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ముస్లిం సోదరులు ఎన్నడూ లేని విధంగా ఈసారి రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. సామూహిక ప్రార్థనలతో సందడిగా మారింది.అనంతరం ఒకరిని ఒకరు అలింగనం చేసుకుంటూ తత్వ కళకళలాడాయి.
