★కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
నేటి గద్ధర్ న్యూస్,కరకగూడెం:పులుసు బొంత ప్రాజెక్టు సంబంధించి భూములు రీ సర్వే నిర్వహించాలని పినపాక MLA పాయం వెంకటేశ్వర్లుకు శుక్రవారం కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ సేల్ ఆధ్వర్యంలో మణుగూరు మండలం ప్రజా భవన్ క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ…
కరకగూడెం మండలంలోని పులుసు బొంత ప్రాజెక్టు సంబంధించి మరొకసారి సర్వే నిర్వహిస్తే భూమి కోల్పోయిన రైతులు అందరికీ నష్టపరిహారం అందే ఆస్కారం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలోనే కరకగూడెం మండల రైతులతో కలిసి పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కి వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గొగ్గలి రవి, రామకృష్ణ,కార్యకర్తలు యువకులు గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు…
