నేటి గద్దర్ న్యూస్, వాజేడు:
వాజేడు మండలం మొరుమూరు గ్రామ పంచాయితీ పరిధిలో గల మొట్లగూడెం గ్రామంలో అంబేద్కర్ జయంతి కమిటీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జయంతి కమిటీ అధ్యక్షులు పూనెం నాగేశ్వరరావు జై భీమ్ జెండాను ఎగరవేసి నివాళులు అర్పించారు. ఈ సమావేశానికి హాజరైనటువంటి వాజేడు మండలం లో గల పలు పార్టీ రాజకీయ నాయకులు మేధావులు గ్రామ ప్రజలు మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగాలను ప్రజల కోసం ఆయన చేసిన పోరాటాలను, సాధించిన విజయాలను గూర్చి సమావేశానికి హాజరైనటువంటి వక్తలు తెలియజేశారు. ఈ సందర్భంగా సభాధ్యక్షులు కుమ్మరి రాంబాబు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల మేరకు ప్రజలందరూ పాటుపడాలని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బహుజన సమాజ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జి తడికల శివకుమార్, కాంగ్రెస్ పార్టీ వాజేడు మండల అధ్యక్షులు బొల్లె డేనార్జన్ రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పూనెం రాంబాబు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బత్తుల శ్రీనివాస్, ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ అధ్యక్షులు చిచ్చడి రాఘవులు, బీఎస్పీ సోషల్ మీడియా నియోజకవర్గ ప్రతినిధి జనగం కేశవరావు, సోడి భీమయ్య, బొర్రా వీరస్వామి తదితర నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.
