నేటి గధర్ న్యూస్, జూలూరుపాడు మండల కేంద్రంలో డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిది అన్నారు. ఆయన రాసిన రాజ్యాంగమే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ అణగారిన కులాల వారు స్వాతంత్ర్యంగా తిరగ గలుగుతున్నామని కొనియాడారు. ఆయనకు ఉన్నటువంటి మేధాశక్తితో ముందస్తు ఆలోచనతో తీసుకొచ్చిన రిజర్వేషన్ చాలా అభినందనీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎమ్మార్పీఎస్ టీఎస్, మాల మహానాడు, ఎం ఎస్ పి, సంఘాల జిల్లా నాయకులు చెంగల గురునాథం, చాపలమడుగు రామ్మూర్తి, మోదుగు రామకృష్ణ, వీరస్వామి, మండల అధ్యక్షులు దెబ్బెందుల సాయి, దామెర్ల సుధాకర్, మోదుగు మణికుమార్, చాపలమడుగు నరసింహారావు, దేవరకొండ కిరణ్, ఇల్లంగి తిరపతి, పోతురాజు రామారావు, కంచపోగు నరసింహారావు, ఇడుపుల రాజు, మంద నరసింహారావు, పోతురాజు ఆనందరావు, నారపోగు నరసింహారావు, కాకటి కృష్ణ, గోలి నరేష్, పాముల రఘు, శ్రీను, నరేష్, ప్రవీణ్, రమేష్, వెంకటేష్, నరేష్, పెద్ద నరసింహారావు, చంటి, మందకృష్ణ, లక్ష్మీనారాయణ, నాగరాజు, రవి, శ్యాము, గోపి, తిరుపతిరావు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
