+91 95819 05907

అధికార పార్టీ కనుసైగల్లో భూకబ్జాలు…?

– భూ యజమానులపై భౌతిక దాడులు చేస్తున్న వైనం
– కాళీ జాగా కనపడితే చాలు అంతా మాదే
– ప్రభుత్వ పాలనలో రాక్షస పాలన
– నాకు న్యాయం చేయండి మహాప్రభో అంటున్న భూ బాధితుడు సోయం విష్ణుమూర్తి
– ఆ నాయకుడు చేష్టలకు ప్రజలు బెంబేలు
నేటి గద్ధర్ న్యూస్, పినపాక నియోజకవర్గ ప్రతినిధి : మండలంలోని భూములు ఖాళీగా కనపడితే చాలు అంతా మాదే అంటూ, కబ్జాలకు పాల్పడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. భూ కబ్జాదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అండగా నిలుస్తూ, అసలు భూ యజమానులను బెదిరిస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. మండలంలోని పాండురంగాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఈసం భవతి తన ఇంటి పక్కన ఉన్న ఐదు సెంట్ల భూమి తనదే అంటూ భూ కబ్జాకు పాల్పడింది. ఆ గ్రామానికి చెందిన సోయం విష్ణుమూర్తి, తన తాతల కాలం నాటి భూమి కావడంతో తనకు సంక్రమిస్తూ వస్తుంది. తన తాతల కాలంలో వేల ఎకరాల భూమిని ఊరు అభివృద్ధి కోసం ఎంతోమందికి దానం దత్తం చేశారని తెలిపారు. ఈసం భవతి ఇంటి పక్కన ఐదు సెంట్ల భూమిని, కబ్జా చేయడమే కాకుండా తన కుటుంబ సభ్యులపై కూడా భౌతికంగా దాడులకు దిగుతుందని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా తన సొంత భూమి కోసం ఈసం భవతి, కొంతమంది కాంగ్రెస్ నాయకుల అండ,దండలు చూసుకొని రెచ్చిపోతున్నారని అన్నారు. ఈ విషయంపై పినపాక తాసిల్దార్ కు ఫిర్యాదు చేయగా, విచారణకు వస్తానని ఆ భూమి మీదకి ఎవరు వెళ్లొద్దని సూచించారు. మాజీ సర్పంచ్ అధికారులు లేని సమయంలో ట్రాక్టర్ల ద్వారా, మట్టి పోసేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకునేందుకు వెళ్లగా తన కుటుంబ సభ్యుల పై దాడులకు దిగడమే కాకుండా ఇష్టానుసారంగా బూతులు తిడుతూ,ఇష్టానుసారంగా ప్రవర్తించందని తెలిపారు. ఈ విషయాన్ని మాజీ సర్పంచ్ ఈసం భవతి కాంగ్రెస్ పార్టీకి చెందిన బుల్ రెడ్డి అనే నాయకుడికి తెలపడంతో అ ప్రదేశానికి వచ్చి , పరిశీలించి మీరు స్టేషన్ లో కేసు పెట్టండి, నేను చూసుకుంటాను అంటూ అండగా నిలిచారని వాపోయారు. అంతేకాకుండా బుధవారం తన మహిళ బంధువు పై బూతులు తిడుతూ,,, దౌర్జన్యంగా భౌతిక దాడికి దిగి, వస్త్రాలను సైతం చించి వేసిందని తెలిపారు. తోటి మహిళ అని చూడకుండా , వస్త్రాలను చించడం ఎంతవరకు సబబు కాదని, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అండదండలతోనే ఈ తతంగం అంత చేస్తుందని తెలిపారు. ప్రజా పాలనలో రాక్షస పాలన జరుగుతుందని ప్రజలు ప్రశాంతంగా బతికేటట్లు లేరని వాపోయారు. ఆ భూమికి సంబంధించిన అన్ని హక్కులు నాకే ఉన్న ఆ కాంగ్రెస్ నాయకుడు మాత్రం ఎమ్మెల్యే పేరు చెబుతూ, భయభ్రాంతులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం అని వాపోయాడు. ఆ కాంగ్రెస్ నాయకుడైన బుల్ రెడ్డి పార్టీ అధికారంలోకి రాగానే తన నైజాన్ని ప్రదర్శిస్తున్నాడని తెలిపారు. మాజీ సర్పంచ్ ఈసం భవతి గ్రామంలో మరి కోన్ని చోట్ల భూ కబ్జాలు చేసిందని వాపోతున్నాడు.మరి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాగానే నిరుంకశ పాలన చేయడం ,కాంగ్రెస్ నాయకులు అడ్డు అదుపు లేకుండా పోతుందని అన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !