+91 95819 05907

BCM:బడులు మొదలయ్యే నాటికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలి:ITDA PO

– భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతిక్ జైన్

నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 19, భద్రాచలం :

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు తిరిగి పాఠశాలలు తెలిసే నాటికి ఏమైనా మరమ్మత్తులు ఉంటే చేయించే విధంగా సంబంధిత ప్రత్యేక అధికారులు బాధ్యత తీసుకోవాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ అన్నారు. శుక్రవారం తన ఛాంబర్ లో సంబంధిత అధికారులతో పిఓ మాట్లాడుతూ… గిరిజన విద్యార్థినీ, విద్యార్థుల విద్యను పటిష్టంగా అమలు చేయడానికి అలాగే విద్యాభివృద్ధి కొరకు ప్రత్యేక దృష్టి సారించి వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించుట కొరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అందుకు ఏటీడీవో పరిధిలోని పాఠశాలల్లో కావలసిన మౌలిక వసతులు ముఖ్యంగా పాఠశాలల్లో విద్యార్థినీ, విద్యార్థుల హాజరు శాతం 100% ఉండేలా హెచ్ఎంలతో పాటు ప్రత్యేక అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా డార్మెటరీ రూములపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఏ పాఠశాలలోనైనా డార్మెటరీ రూములు పాడైపోతే వెంటనే మరమ్మతులు చేయించాలని అన్నారు. మరుగుదొడ్లు టాయిలెట్ రూమ్స్ ఎన్ని పని చేస్తున్నవి, మరమ్మత్తులో ఉన్నవి వాటికి సంబంధించిన వివరాలు త్వరగా తెప్పించాలని డిడి ట్రైబల్ వెల్ఫేర్ కు ఆదేశించారు. ప్రతి పాఠశాలలో టాయిలెట్స్ రూమ్స్ మాత్రం పిల్లలకు పనికొచ్చే విధంగా తీర్చిదిద్దాలని,12 జూన్ లోగా డార్మెటు రూములు మంచిగా ఉండాలని అలాగే మంచాలు, డైనింగ్ హాల్స్ ,లాబరేటరీలు ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, అన్ని సక్రమంగా సమకూర్చాలని అన్నారు. పాఠశాలల్లో పనికిరాని స్క్రాప్ కు సంబంధించిన వస్తువులు ఏమైనా ఉంటే సబ్ డివిజన్ కమిటీ ద్వారా వాటిని పరిశీలించి తొలగించాలని అన్నారు. అలాగే ప్రత్యేక అధికారులు పాఠశాలలకు వైట్ వాష్ , ఫ్లోరింగ్ రిపేరింగ్, మంచాలు కటింగ్ చేయించి విద్యార్థులందరికీ అందే విధంగా చూడాలని అన్నారు. డార్మెటరీ మంచిగా చేయించిన తర్వాత వాటి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే అవి పాడైపోయినట్టు తన దృష్టికి వస్తే సంబంధిత వార్డెన్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, స్పెషల్ ఆఫీసర్లు తప్పనిసరిగా వారికి కేటాయించిన పాఠశాలలకు సందర్శిస్తూ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీ, ఎస్ఓ సురేష్ బాబు, ఉద్యానవన అధికారి అశోక్ కుమార్, ఏడీ అగ్రికల్చర్ భాస్కరన్, జేడియం హరికృష్ణ, ఏటీడీవోలు, జిసిడిఓ, డిఇలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు

హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు.. వాళ్ళను వెనక్కి పంపాలని రేవంత్ ప్రభుత్వానికి అమిత్ షా ఆదేశాలు పాకిస్థానీయులను వెనక్కి పంపండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి

Read More »

రైతుల భూములను భరోసా కల్పించే చట్టం భూ భారతి చట్టం… జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ

నేటి గద్దర్ న్యూస్,చింతకాని ప్రతినిధి, రైతుల భూములకు భరోసా కల్పించే చట్టం భూభారతి చట్టమని జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ అన్నారు. *గురువారం జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ చింతకాని మండలం నాగులవంచ

Read More »

నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరై..ఆశీర్వదించిన జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు& ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు.మడుపల్లి భాస్కర్.

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి, ఈరోజు ఖమ్మం పట్టణంలోని R R R. ఫంక్షన్ హాల్ నందు …చింతకాని చెన్నకేశవ స్వామి దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ *దమ్మాలపాటి వెంకటేశ్వర్లు మేనకోడలు వేమూరి

Read More »

కాశ్మీర్ లో జరిగిన దాడికి నిరసనగా శాంతి ర్యాలీ, నిరసన

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 24: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేటలో మల్కరం వెళ్లే జంక్షన్ (రవి మెడికల్స్) ఎదురుగా మేము సైతం ఫౌండేషన్ మరియు వివిధ సంఘాల ఆధ్వర్యంలో కాశ్మీర్లో జరిగిన

Read More »

చలో వరంగల్, సైకిల్ పై ప్రచార యాత్ర నిర్వహించిన బిఆర్ఎస్ కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 24: ఈనెల 27 న వరంగల్ లో జరుగుతున్న బిఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభ, ను జయప్రదం చేయాలని కోరుతూ సైకిల్ యాత్ర ప్రారంభించిన భద్రాద్రి

Read More »

ఈనెల 27న నిర్వహిస్తున్న రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుంది

. గజ్వేల్ మండల్ సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి చిట్యాల ఎల్లం. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) ఏప్రిల్ 24. వరంగల్ లో ఈనెల 27న ఎల్కతుర్తి లో జరిగే రజోత్సవ

Read More »

 Don't Miss this News !