నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 19, భద్రాచలం :
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం, శ్రీ స్వామివారి మహాపట్టాభిషేకం మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించడం హర్షనీయమని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతు రావు అన్నారు. ఈ మహోత్సవాలకు సహకరించిన అధికారులు, ఆలయ అర్చక బృందాన్ని సమాచార పౌర సంబంధాలు, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతు రావు భద్రాచలంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఈఓ రమాదేవితో పాటు ఈఈ రవీందర్, వివిధ విభాగాల అధికారులను కమీషనర్ సన్మానించారు.
Post Views: 277









