నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 19, మహబూబాబాద్ :
మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోరిక బలరాం నాయక్ శుక్రవారం మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ… మరోసారి మీ అందరి ఆశీస్సులు కోరుతున్నానని అన్నారు. గతంలో మీ అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిగా పని చేసానని, మహబూబాబాద్ పార్లమెంట్ అభివృద్ధికి నా శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. మరోసారి అవకాశం కల్పిస్తే ఇదే స్పూర్తితో పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు
పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 377