నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 19, బూర్గంపాడు :
బూర్గంపాడు మండల పరిధిలోని తాళ్ల గొమ్మూరు సత్యనారాయణ స్వామి ఫంక్షన్ హాల్ నందు శుక్రవారం జరుగుతున్న వివాహ వేడుకకు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు హాజరయ్యారు. ఈ వేడుకలో నూతన వధూవరులైన బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు దాసరి విజయ్ కుమార్, స్వప్న లను నిండు మనసుతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రేగా కాంతారావు తో పాటు బూర్గంపాడు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, ఆ పార్టీ సారపాక టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీనివాస్, నాయకులు చల్లకొట్టి పూర్ణ చందర్రావు, పంగి సురేష్, జుబేర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 581