★తీరు మార్చుకోని పర్ణాశాల బోటు నిర్వహణా యాజమాన్యం
★ అధికారుల మెతకవైఖరి, నిర్లక్ష్య ధోరణి అమ్యమ్యాలకు ఆశపడేనా?
★భక్తుల, పర్యాటకుల, ప్రజల ప్రాణాలు తో చెలగటం ఆడటం దుర్మార్గం
★ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పర్ణశల బోటు షికారు నిర్వహణను రద్దు చెయ్యాలి లేదా
నిబంధనల పాటిస్తూ అధికారుల సమక్షంలో బోటు నిర్వహణా జరిగేలా ఖటిన చర్యలు తీసుకోవాలి :CPI(ML) మాస్ లైన్
ఇప్పటికీ ప్రజల ప్రాణాల పట్ల, ప్రజల భద్రత పట్ల, పర్ణశాల ప్రతిష్ఠ పట్ల సంబంధిత అధికారులు శ్రద్ధ చూపకపోతే ఉద్యమం చెయ్యడం తథ్యం
CPI(ML) మాస్ లైన్ పార్టీ దుమ్ముగూడెం మండల కమిటీ
నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
పర్ణశాల బోటు పర్యాటకుల కు రక్షణ కల్పించాలి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ దుమ్ముగూడెం మండల కమిటీ డిమాండ్ చేసింది పర్ణశాల పుణ్యక్షేత్రం వద్ద నడుపుతున్న బోటు కాంట్రాక్టు ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని వారిపై ప్రభుత్వ అధికారులు చర్య తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ దుమ్ముగూడెం మండల కార్యదర్శి సాయన్న అన్నారు. బోటు నిర్వాహకులు గత కొన్ని రోజుల క్రితం పర్యాటకులకు రక్షణ లేకుండా నడుపుతున్నారని సోషల్ మీడియా ద్వారా అధికారులకు తెలియజేయడం జరిగింది అయినప్పటికీ కాంట్రాక్టర్ పై చర్య తీసుకోలేదు బోటు పర్యాటకులకు రక్షణ కల్పించాలని అన్నారు పర్యాటక ప్రాంతమైన బోటు రేవులో తక్షణ రక్షణ కోసం ఏఎన్ఎం కానిస్టేబులు మంచినీళ్లు నీడ ఏర్పాటు చేయాలని ఇప్పటికైనా అధికారులు స్పందించాలని స్పందించని ఎడల ప్రజల పక్షాన సిపిఐ ఎంఎల్ మాసులను పార్టీ పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో mass line భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్, మండల కార్యదర్శి సాయన్న మాట్లాడారు. నారాయణ భీమరాజు తదితరులు పాల్గొన్నారు