హైదరాబాదులో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ సర్వసభ్య సమావేశం
నేటి గద్దర్ న్యూస్ ,జూలూరుపాడు :
హైదరాబాద్ గాంధీభవన్లో జరుగు— మే 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో అసెంబ్లీ, బ్లాక్ స్థాయిలో, మండల స్థాయిలో, బూత్ స్థాయిలో, డివిజన్ స్థాయిలో, సేవాదళ్ యొక్క పాత్ర గురించి చర్చించి, ప్రజలలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ యొక్క ఐదు న్యాయ పత్రల మేనిఫెస్టోను, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఆరు గ్యారెంటీల అమలు విషయమై చర్చించనున్నారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జనరల్ సెక్రెటరీ కోదుమూరిదయాకర్ రావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీ కేశబోయిన నరసింహారావు, కొదుమూరి కోటేశ్వరరావు, అశ్వరావుపేట నియోజకవర్గం అధ్యక్షులు శ్రీ బండారు మహేష్ నియోజవర్గ ఏ, బి, బ్లాక్ అధ్యక్షులు చాపలమడుగు లక్ష్మణ్, కుంజే.వెంకటేశ్వరరావు, అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షులు పటాన్ ఇమ్రాన్ ఖాన్, చండ్రుగొండ మండల అధ్యక్షులు బుంగ శ్రీనివాస్, అశ్వరావుపేట మండల అధ్యక్షులు తమ్మిశెట్టి పోసి, చండ్రుగొండ మండల కాంగ్రెస్ నాయకులు చాపలమడుగు మనోహర్, కుక్కముడి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
