పినపాక, నేటి గద్ధర్ న్యూస్: ఏడుల్ల బయ్యారం రేంజ్ ఇంచార్జి రేంజర్ గా మణుగూరు రేంజర్ గుగులోత్ ద్వాలియా శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం విధులు నిర్వహించిన ఏడుల్ల బయ్యారు రేంజర్ తేజస్విని కొన్ని నెలల పాటు సెలవు పై వెళ్లడంతో ద్వాలియా కుఆ శాఖ ఉన్నత అధికారులు అదనపు బాధ్యతలు అప్పగించారు. రేంజర్ ద్వాలియా ఇదివరకే 2016 నుండి 2019 వరకు ఏడుల్ల బయ్యారం రేంజర్ గా విధులు నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ… అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అడవులను ధ్వంసం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అన్ని వర్గాల ప్రజలు వివిధ రాజకీయ పక్షాల నాయకులు నేతలు సహకరించాలని కోరారు.
Post Views: 38