నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 21, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి :
రోజంతా కష్టపడితే ఆ పూట గడిచే పరిస్థితిలో ఉన్నప్పటికీ… సాటివారికి సహాయం చేయాలనే సంకల్పం ముందు ఆర్థిక సమస్యలు ఓడిపోతాయని మరోసారి గాంధీనగర్ ఆటో యూనియన్ సభ్యులు నిరూపించారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పంచాయితీ లోని గాంధీనగర్ ఆటో యూనియన్ తరపున రూ 3,400/- వితరణ అందజేశారు. గాంధీనగర్ కాలనీలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఆటో డ్రైవర్ కువ్వారపు బాలయ్య కుటుంబాన్ని యూనియన్ సభ్యులు పరామర్శించారు. యూనియన్ ఆధ్వర్యంలో రూ.3,400/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. తమ తోటి ఆటో యూనియన్ సభ్యుడి కుటుంబానికి తమకు చేతనైన సహాయం చేయడం బాధ్యతగా భావిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ ఆటో యూనియన్ అధ్యక్షులు.పి శేఖర్, జి.నరసింహ, యేసుపాదం, కుట్ట, నాగరాజు, జానీ,శంకర్ తదితరులు పాల్గొన్నారు.