– తడిసి ముద్దైన ధాన్యం
– నేలమట్టమైన నివాసాలు
– రైతు కూదెలు
నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 21, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :
✍️అల్వాల వంశీ
ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అకాలంగా కురిసిన వర్షానికి రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. గాలి దుమారంతో వచ్చిన వర్షం రైతుల ఆశలపై నీళ్లు జల్లుతూ… చేతికి వచ్చిన పంటను నోటి దాకా రాకుండా చేసింది. ఆరుగాలం శ్రమించి పండించిన ఆరబోసిన పంటను అకాల వర్షం నీట ముంచడంతో దాన్యమంతా తడిసి ముద్దయ్యాయి. పలువురి మామిడి తోటలు సైతం అకాల వర్షానికి కాసిన ఖాతా నేల రాలిపోయింది. అంతేకాక జిల్లాలోని పినపాక, కరకగూడెం తదితర మండలాల్లో వర్షంతో కూడిన గాలి బీభత్సానికి విద్యుత్ స్తంభాలు, నివాస గృహాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. జిల్లాలోని పలు మండలాల్లో వర్షం బీభత్సం సృష్టించడంతో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి.
★పినపాక మండల పరిధిలోని ఇప్పలగుంపు గ్రామానికి చెందిన
యెట్టి సమ్మయ్య అనే వ్యక్తి సిమెంటు రేకుల ఇంటిపై తాటి చెట్టు పడడంతో ఇంట్లో ఉన్న సమ్మయ్య నడుముకు గాయలు అయ్యాయి. సమ్మయ్య కు చెందిన రెండు మేక పోతులు మరణించాయి. వరునుడి ఆగ్రహానికి తీవ్రంగా నష్టపోయామంటూ రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
★ కరక గూడెం, పినపాక మండలాల్లోని వరి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది
★ ఆడ మగ వరి వేసిన రైతులపై అకాల వర్షం పెను ప్రభావం చూపింది. ఒక్క గింజ లేకుండా రాలిపోయాయని రైతులు రోదిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు
రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.