నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 22, భద్రాద్రి కొత్తగూడెం(మణుగూరు) :
పినపాక నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం ఈ నెల 23న మంగళవారం నిర్వహించనున్నట్లు పినపాక MLA పాయం వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశం మంగళవారం సాయంత్రం 3 గంటలకు మణుగూరు కిన్నెర కళ్యాణ మండపం నందు నిర్వహించనున్నామని వెల్లడించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రివర్యులు మహబూబబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంటు అభ్యర్థి పోరిక బలరాం నాయక్, డిసిసి అధ్యక్షులు పొదెం వీరయ్య హాజరు కాలు ఉన్నారని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సకాలంలో హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Post Views: 139