◆ అభినందించిన మాజీ MEO మద్దిశెట్టి వెంకటేశ్వరరావు నేటి గద్దర్ న్యూస్
జూలూరుపాడు :
మండల కేంద్రము నందు 5వ తరగతి ప్రవేశం కొరకు గురుకుల పరీక్షలలో అత్యధిక సీట్లు సాధించిన 50 మంది సాయి ఎక్సలెంట్ స్కూల్ విద్యార్దిని, విద్యార్థులను అభినందించిన మాజీ ఏం ఈ ఓ మద్దిశెట్టి వెంకటేశ్వర రావు గారు, జూలూరూపాడు మండల కేంద్రం పరిధిలోని సాయి ఎక్సలెంట్ విద్యాలయం నందు ఫిబ్రవరి 11న గురుకుల ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఈ ఎంట్రెన్స్ పరీక్ష నందు 50 మంది విద్యార్దులు సీట్లు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలూరుపాడు మండల కేంద్రం నందు సాయి ఎక్సలెంట్ విద్యాలయం ప్రతి సంవత్సరం నవోదయ, గురుకులంలో సాయి ఎక్సలెంట్ విద్యాలయం సీట్లు సాధించడం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. సీట్లు సాధించిన విద్యార్దిని, విద్యార్దులు అందరూ హాస్టల్ లో చేరి మీ బంగారు భవిష్యత్ కు పునాదులు వేసుకొని బాగా చదివి భావి భారతదేశానికి రేపటిపౌరులుగా నిలబడి మంచి ఉన్నత స్థానాలకు వెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ సిహెచ్ శారద దేవి మాట్లాడుతూ మా సంస్థ నందు ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శిక్షణ తో పాటు గ్రామ స్థాయిలో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అనేక కాంపిటీటివ్ ఎగ్జామ్ లో సీట్లు సాధించి జిల్లా స్థాయిలో మంచి గుర్తింపు ఇచ్చిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లి దండ్రులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ 2024-25 విద్య సంవత్సరానికి గాను సిబిఎస్ఇ మరియు కేరళ టీచర్స్ చే విద్యా బోధన సాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్లు హుస్సేన్, శివ కుమారి నరసింహారావు భద్రం ఉపాధ్యాయుని, ఉపాధ్యాయలు సత్యవతి, నబీన సరిత దుర్గ భవాని అనిత సింధూ మోహన్ మణిదీప్, శాంతమ్మ , భారతమ్మ, కృష్ణయ్య లు పాల్గొన్నారు.
