*CPI (ML) 55 ఆవిర్భావ దినోత్సవం* సందర్భంగా CPI (ML) మాస్ లైన్ (ప్రజాపంథా) ఆధ్వర్యంలో మండల పరిధిలోని గుండ్లరేవు గ్రామంలో పార్టీ పతాకాన్ని పార్టీ సీనియర్ నాయకులు మల్కం వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. పార్టీ మండల కార్యదర్శి బానోతు ధర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో CPI (ML) మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా కార్యదర్శి జాటోత్ కృష్ణ మాట్లాడుతూ రష్యా విప్లవ నాయకుడు, కమ్యూనిస్ట్ రాజకీయ వేత్త, రష్యన్ దేశానికి మొదటి కమ్యూనిస్టు అధినేత
చరిత్ర గతిని మార్చి,శ్రమజీవుల రాజ్యం సోషలిజం స్థాపనకై తన జీవితాంతం కృషి చేసిన లెనిన్ పోరాట స్ఫూర్తితో కార్మిక వర్గం అణగారిన ప్రజలు పోరాటాలలో ముందుండాలని జాటోత్ కృష్ణ పిలుపునిచ్చారు. భారతదేశంలో రివిజనిస్టు, నయా రివిజనిస్టు విధానాలకు వ్యతిరేకంగా విప్లవ కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో 1969 ఏప్రిల్ 22 న లెనిన్ పుట్టినరోజున సిపిఐ ఎంఎల్ పార్టీని దేశంలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, మార్క్సిజం లేనినిజం మావో ఆలోచన విధానంతో, నూతన ప్రజాస్వామ్యక విప్లవ విజయవంత లక్ష్యంగా,దోపిడికి గురవుతున్న పీడిత వర్గాలు తమ పోరాటం కొనసాగించాలని ఆయన కోరారు.
నేడు దేశంలో మోడీ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ భావజాలంతో బ్రాహ్మణ మనువాదంతో అనగారిన వర్గాలపై దాడులు చేస్తూ దుర్మార్గ కరమైన వైఖరిని అవలంబిస్తున్నారని ఆయన విమర్శించారు. బిజెపి పాలనలో కార్పొరేట్లకు అనుకూలంగా ప్రధానమంత్రి మోడీ విధానాలు ఉన్నాయని అన్నారు. అదాని అంబానీలకు కొమ్ము కాస్తున్న బిజెపి ఆర్ఎస్ఎస్ కూటమిని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని,
మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని కృష్ణ కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజా పంథా) డివిజన్ నాయకులు ఏదులాపురం గోపాలరావు, మండల నాయకులు మల్కం వెంకటేశ్వర్లు , నరసింహారావు,తాటి రోహిణి, తెళ్ళం పాపారావు, దొడ్డ ఉదయ్ కుమార్, కోరంపల్లి రమణ, వర్ష సావిత్రి, వరుస సైదా, ఊకే నరసమ్మ, ముక్తి లక్ష్మి, వరుస రామకృష్ణ, దొడ్డ వెన్నెల,ఎట్టి సత్యవతి,తదితరులు పాల్గొన్నారు.
