+91 95819 05907

Bhurgampahad: కరువు పనిలో గందరగోళం రోజుకు రూ.65..వారానికి రూ 400?!

– రూ.30 కూలీ ఏందంటున్న Egs కూలీలు?!
– మసి పూసి మారేడు కాయ చేసే పనిలో అధికారులు..?
– కొత్త అధికారి తోనే సమస్య మొదలైందా..?

గద్దర్ న్యూస్, ఏప్రిల్ 23, భద్రాద్రి కొత్తగూడెం (ప్రతినిధి) : (✍️ అలవాల వంశీ)

బూర్గంపాడు మండల పరిధిలోని జరుగుతున్న కరువు పనిలో కొందరు అధికారుల పనితనం వల్ల కళ్లిపెళ్లి మొదలవుతుందని విమర్శలు భారీగా వినిపిస్తున్నాయి. రైతువారి పనులు లేని సమయంలో కూలీలకు పని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNR EGS) బూర్గంపాడు మండలంలో నవ్వుల పాలు అవుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఉదయాన్నే ఏడు గంటలకు పలుగు, పారా.. భుజాన వేసుకొని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉపాధి హామీ పనికి ఆటోకి కిరాయి ఇచ్చుకొని వెళ్లి ఎర్రటి ఎండలో పనిచేస్తే రోజుకు 30 రూపాయలు కూలీ వస్తుందంటే ఉపాధి హామీ పథకం అధికారుల తీరు తేటతెల్లమవుతుంది. మండల పరిధిలోని నాగినేని ప్రోలు పంచాయతీలో ఉపాధి హామీ అధికారుల సొంత తెలివితేటలు కూలీలకు శాపంగా మారుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 40 రూపాయలు కిరాయి పెట్టుకొని ఉపాధి హామీ పనికి వెళితే.. రోజుకు 30 రూపాయలు కూలీ రావడంతో కూలీలు షాక్ అయ్యారు. వారం రోజులు పనిచేస్తే.. ఆ వారానికి గాను సుమారు 400 రూపాయల కూలీ వచ్చిందంటూ ఉపాధి హామీ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత పని చేస్తే ఎంత కూలీ పడుతుంది అని వివరించి పని చేయించాల్సిన అధికారులు.. ఆ విషయం పక్కన పెట్టి, పనికి రాని వారికి కూడా హాజరు వేస్తున్నారు అని పలువురు ఆరోపిస్తున్నారు. పనిచేసిన కూలీలకు 30 రూపాయలు వస్తుంటే, పనిచేయని కూలీలకు హాజరు వేస్తూ పని చేయని వారికి సైతం కూలీ డబ్బులు అందిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పనిచేసిన ఉపాధి హామీ కూలీల కష్టాన్ని కొందరు అధికారులు పనిచేయని వారికి దోచిపెడుతున్నారని వాపోతున్నారు. కూలీలకు కనీస సదుపాయాలు సైతం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రటి ఎండలో పనిచేస్తున్నప్పటికీ పని ప్రదేశంలో కనీసం టెంట్ కూడా వేయడం లేదని కూలీలు మండిపడుతున్నారు. ఎండ తీవ్రతకు ప్రాణం ఉక్కిరి బిక్కిరి అవుతున్నా ఎండలోనే ఉండాల్సిన దుస్థితి ఉపాధి హామీ కూలీలకు తప్పడం లేదని వాపోతున్నారు. ఎండ తీవ్రతకు కూలీలకు ఏదైనా జరగకూడనిది జరిగితే ఆ బాధ్యత అధికారులు తీసుకుంటారా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. బూర్గంపాడు మండలంలో ఇటీవల జరిగిన సామాజిక తనిఖీలో కొందరు అధికారులు అవకతవకలకు పాల్పడినట్లు ఆడిటర్లు గుర్తించిన విషయం విధితమే. అవకతవకలకు పాల్పడిన వారికి నోటీసులు కూడా అధికారులు అందజేశారు. అది జరిగి నెలలు గడవకముందే మళ్లీ నాగినేని ప్రోలు పంచాయతీలో తెరమీదకు వస్తున్న ఉపాధి హామీ అవకతవకలు విషయంలో ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ నేపద్యంలో ఉపాధి హామీ అవకతవకలపై పూర్తి వివరాలతో నేటి గద్దర్ న్యూస్ వరుస కథనాలు ప్రచురితం చేయనుంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !