నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 23, భద్రాద్రి కొత్తగూడెం :
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని ఖమ్మం పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాచలం శ్రీ సీతారాములను దర్శించుకునేందుకు వచ్చిన నామా నాగేశ్వరరావుకు ఆలయ అర్చకులు స్వాగతం పలుకుతూ శాలువాతో సత్కరించారు. రేపు నామ నాగేశ్వరరావు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. కాగా భద్రాచలం సీతారాముల ఆశీస్సులు కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నామా వెంట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, భద్రాచలం నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకులు మానే రామకృష్ణ తదితరులు ఉన్నారు.
Post Views: 394