★ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి
★డ్రైనేజీ కొలతలో ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించండి
★జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా
నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి(పినపాక):
వేసవి సెలవులు ముగిసేలోగా జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా ఎన్నికైన అన్ని పాఠశాలల్లో మరమ్మతు పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. మంగళవారం పినపాక మండలంలో కలెక్టర్
పర్యటించారు. పాండురంగాపురం ,జానంపేట పాఠశాలలను కలెక్టర్ పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనుల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మంజూరైన పనులను మే నెల ఆఖరుకల్లా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం జానంపేట గ్రామపంచాయతీ సాయి నగర్, సుందరయ్య నగర్ గ్రామాల్లో పర్యటించి గ్రామస్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 23 గ్రామ పంచాయతీల పరిధిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం బయ్యారం క్రాస్ రోడ్ లో డ్రైనేజీ కొలతకు మించి నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదులు వస్తున్నాయని డ్రైనేజీ వరకు వెంటనే శుభ్రం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సూర్య నారాయణ, ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీఓ వెంకటేశ్వరరావు, పిఆర్ ఏఈ రేనాల్డ్ , ఆర్డబ్ల్యూఎస్ ఏఈ విజయకృష్ణ, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.