– విషయం బయటకు రాకుండా మంతనాలు జరుగుతున్నాయా..?
– గుట్టు చప్పుడు కాకుండా బాడీని బయటకు పంపించారా..?
నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 24, భద్రాద్రి కొత్తగూడెం :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక ఐటిసి పేపర్ మిల్లులో డ్యూటీ కి వెళ్ళిన ఒక కార్మికుడు మృతి చెందినట్లు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యులతో కంపెనీకి సంబంధించిన వ్యక్తులు విషయం బయటకు రాకుండా మంత్రాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. కార్మికుడు మంగళవారం మృతి చెందగా… ఇప్పటివరకు బయటకు సమాచారం రాకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. గుట్టు చప్పుడు కాకుండా మృతుడి పార్థివ దేహాన్ని బయటకు పంపించినట్లు వినికిడి. పేపర్ మిల్లులో జరుగుతున్న ఇటువంటి సంఘటనలు బయటకు రాకుండా మంతనాలు జరుపుతూ… తమకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కొన్ని పార్టీలకు చెందిన వారిని తమ మధ్యవర్తులుగా ఉపయోగిస్తున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి. మధ్యవర్తులుగా వ్యవహరించేవారు కంపెనీకి న్యాయం చేయడానికి వస్తున్నారా..? కార్మికులకు న్యాయం చేయడానికి వస్తున్నారా..? అనే ప్రశ్నకు సమాధానం చెప్పగలరా అని కార్మికుల కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. కార్మికుడు మృతి నిన్న జరిగినప్పటికీ నేటి వరకు కనీసం మీడియాకు కూడా సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బయటకు తెలియకుండా కంపెనీ లోపల ఇంకెన్ని జరుగుతున్నాయి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.