నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
చర్ల మండలంలోని పూసుగుప్ప గ్రామంలో 81 బెటాలియంలో
అసిస్టెంట్ కమాండెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఎం.వి శేషగిరిరావు గన్
మిస్ ఫైర్ అయి చాతిలో బుల్లెట్ దిగడంతో మృతి చెందారు. సమీప
అడవుల్లోకి కూంబింకు వెళ్లి తిరిగి బేస్ క్యాంపుకు వస్తున్న క్రమంలో
మార్గమధ్యలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద
పడిపోయారు.ఆయన వద్ద ఉన్న తుపాకీ కూడా పడిపోయింది ఈ
క్రమంలో పడిపోయిన ఏకే 47 తుపాకీ నీ తీసుకొని సరిచేస్తుండగా
తుపాకీ మిస్ ఫైర్ కావడంతో బుల్లెట్ ఛాతి క్రింది నుంచి దిగడంతో
అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు హుటాహుటిన జవాన్లు ఆయనను
భద్రాచలం ఏరియా హాస్పిటల్ కి తరలిస్తుండగా శేషగిరిరావు
మార్గమధ్యలోనే మృతి చెందారు అసిస్టెంట్ కమాండెంట్ గా విధులు
నిర్వహిస్తున్న శేషగిరిరావు, అనంతపురం జిల్లా వాసిగా తెలిసింది.
Post Views: 1,186