+91 95819 05907

HYD:BJP నయ వంచన…పదేండ్ల మోసం… వందేండ్ల విధ్వంసం bn

★గాంధీభవన్లో ప్రజా చార్జిషీట్ ఆవిష్కరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు

నేటి గద్ధర్ న్యూస్ వెబ్ డెస్క్:
కొద్దిమందికి దేశ సంపదను కట్టబెట్టేందుకు మోడీ ప్రయత్నం

జనాభాను విభజించి మతకల్లోలాలు సృష్టించేందుకు బిజెపి ప్రభుత్వం ప్రయత్నం

కులగనన చేసి సంపదను అధిక శాతం జనాభా కు పంచడమే రాహుల్ ద్యేయం

కోట్ల ఉద్యోగాలు, నల్లధనం వెలికితీత, పేదల అకౌంట్ లో 15 లక్షలు గత్త పదేళ్లుగా
మోడీ ప్రభుత్వం మోసం

పదేండ్ల మోసం..
వందేళ్ల విధ్వంసం బిజెపి పాలనపై ప్రజా చార్జిషీట్ ఆవిష్కరణ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

కొద్దిమంది తన స్నేహితులు, క్రోనీ క్యాపిటలస్ కు దేశ సంపదను కట్టబెట్టేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. జనాభాను కులాలు మతాలుగా విభజించి మతకల్లోలాలు సృష్టించేందుకు బిజెపి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ఒక రాష్ట్రం పై మరొక రాష్ట్రం దాడి చేసి సంపదను దోచుకునేవి.. ప్రస్తుతం ఈ దేశంలో మోడీ హయాంలో అదే ధోరణి కొనసాగుతోంది.
గత పదిఏళ్లు గా ఈ దేశ ప్రజలను మోడీ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందో చూశాం. రాబోయే ఎన్నికల్లో గెలుపొందేందుకు మోసపూరిత హామీలు ఇస్తోంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోడీ గతంలో హామీ ఇచ్చారు ,కానీ గత పది ఏళ్లలో ఈ హామీని అమలు చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా పేరుకుపోయిన భారతీయుల నల్లధనాన్ని వెలికి తీసి దేశంలోని పేదవాళ్ల అకౌంట్లో 15 లక్షల చొప్పున జమ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ దేశంలో ఏ ఒక్క పేదవాని అకౌంట్లో 15 లక్షలు జమ కాలేదు. పెద్ద నోట్ల రద్దుతో నకిలీ కరెన్సీని అరికడతామని చెప్పారు. పదేళ్లయిన ఈ హామీకి సంబంధించిన సమాచారం కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు.
ప్రధాని మోడీ తన కొద్దిమంది క్రోనీ క్యాపిటల్స్ స్నేహితుల కోసం విదేశీ సంపదను ఎలా దోచిపెడుతున్నాడో యువ నేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర నిర్వహించి వివరంగా ఈ దేశ ప్రజలకు చాటారు. దేశ సంపదను కొద్దిమందికి కట్టబెట్టాలని చూసే మోడీ ప్రభుత్వం ఓవైపు.. కుల గణన చేసి అధిక శాతం ఉన్న జనాభా కు ఈ దేశ సంపదను పెంచాలని రాహుల్ గాంధీ మరోవైపు ఈ ఎన్నికల్లో పోరాటం చేస్తున్నారు.
రాజ్యాంగాన్ని, లౌకికవాదం, ఈ దేశ సంపదను కాపాడేందుకు రాహుల్ గాంధీ నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారని తెలిపారు. లౌకికవాదం ప్రజాస్వామ్యం ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు మీడియా ముందుకు రావాలని డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు. చార్జ్ షీట్ లో పేర్కొన్న ప్రతి విషయాన్ని ప్రతి పౌరునికి ఇంటికి చేరే విధంగా కాంగ్రెస్ సైన్యం కృషి చేయాలని డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఏసీబీ అలజడి

వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలు, అక్రమ చెలామణీలపై పలువురు చేసిన ఫిర్యాదులు ఈ దాడులకు కారణమయ్యాయి. ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు

Read More »

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు.

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల కేంద్రంలోని మాజీ వైస్ ఎంపీపీ బండి రత్నాకర్ చనిపోయి నేటికి 20

Read More »

జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్ర చిన్నపిల్లలకు ఆదర్శం కావాలి.

మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు. నేటి గదర్ న్యూస్,,చింతకాని ప్రతినిధి: భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రు జీవిత చరిత్ర చిన్నపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని మతికేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు కోరినారు.

Read More »

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు వేషధారణలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.

Read More »

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది ◆ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు:మంత్రి పొంగులేటి

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది. ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు.. దశాబ్దకాలం జరిగిన విద్వంసాన్ని చక్కదిద్దే కాంగ్రెస్ పైనే ప్రజల నమ్మకం. ప్రజా పాలన, సంక్షేమం, అభివృద్ధి

Read More »

నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్.

వైరా నియోజకవర్గం కేంద్రంలో పేదలకు అందని ప్రభుత్వ వైద్యం నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్. వంద పడకల హాస్పిటల్ గా అఫ్ గ్రేడ్ చేసినా సరైన వైద్యం అందటం

Read More »

 Don't Miss this News !