– ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
– 10మంది బైండ్ ఓవర్
నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 26, భద్రాద్రి కొత్తగూడెం :
బూర్గంపాడు మండల పరిధిలోని గ్రామాలలో గురువారం ఎక్సైజ్ శాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. గుడుంబా స్థావరాలపై దాడులు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సారపాక గ్రామంలోని ఆటో స్టాండ్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను విచారించారు. వారి వద్ద నుండి సుమారు 30 లీటర్ల గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా బూర్గంపాడు పరిసర ప్రాంతాల్లో సుమారు 25 లీటర్ల గుడుంబాను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా స్థావరాలలో నాటు సారాను తయారు చేసేందుకు సిద్ధం చేసి ఉంచిన సుమారు 800 లీటర్ల బెల్లం ఊటను ఎక్సైజ్ అధికారులు గుర్తించి, ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు నిందితులపై కేసు నమోదు నమోదు చేసినట్లు ఎస్సై అల్లూరి సీతారామరాజు తెలిపారు. పదిమంది వ్యక్తులను బైండోవర్ చేసినట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్సై అల్లూరి సీతారామరాజు మాట్లాడుతూ… గుడుంబా తయారీ, విక్రయాలకు పాల్పడితే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని ఆయన అన్నారు. ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్ఐ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.