+91 95819 05907

సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం తప్పదు:Cpi ml -mass line

*★చింతలపాడు గ్రామంలోని ఆదివాసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి

*★కరెంటు, మంచినీటి సౌకర్యాలు తక్షణమే కల్పించాలి*

*★పట్టించుకోకపోతే పోరాటం తప్పదు*

*★CPI(ML) మాస్ లైన్ పార్టీ సంయుక్త మండలాల డివిజన్ కార్యదర్శి కొండా చరణ్*

నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి(ఎటపాక):
ఎటపాక మండలంలోని పలు గ్రామాలలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ సంయుక్త మండలాల డివిజన్ నాయకుల బృందం పర్యటించి ప్రజలను గ్రామాల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా సంయుక్త మండలాల డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ మాట్లాడుతూ ఈరోజు పార్టీ ఆధ్వర్యంలో ఎటపాక మండలంలో పలు గ్రామాలను పర్యటించామని అనేక సమస్యలు తమ దృష్టికి ప్రజలు తీసుకొచ్చారని అన్నారు అందులో భాగంగానే ఆదివాసి గ్రామమైన చింతలపాడు గ్రామంలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు బోర్లు పనిచేయడం లేదని సోలార్లపై ఆధారపడి ఇప్పటివరకు మంచినీటిని వాడుకుంటున్నారని కానీ ఇప్పుడు ఆ సోలార్లు కూడా పనిచేయడం లేదని తద్వారా గ్రామంలోని ప్రజలు మంచినీటి ఎద్దడితో ఎండాకాలం తీవ్రమైన అవస్థలు పడుతున్నారని పిల్లలు పెద్దలు అందరూ దాహానికి అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దానితోపాటు కరెంటు సౌకర్యం లేదని సోలార్ సిస్టం పనిచేయకపోవడం వల్ల ఈ గ్రామంలో ప్రస్తుతం చీకట్లో మగ్గుతుందని ఇది అటవీ ప్రాంతం కావడం వల్ల ఇక్కడ క్రూర జంతువులు విషపు పాములు క్రిమి కీటకాలు తిరిగి అవకాశం ఎక్కువగా ఉందని అన్నారు ఇది ఇలాగే కొనసాగితే ఇక్కడి ప్రజలు ఈ చీకట్లో ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని అన్నారు ఎన్నిసార్లు ఈ సమస్యని అధికారులకు చెప్పిన ఎన్నిసార్లు చెప్పులురిగేలా ఆఫీసుల చుట్టూ తిరిగిన ఎన్ని వినతి పత్రాలు ఇచ్చిన అధికారులకు పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు అంటున్నారని అన్నారు అధికారులు స్పందించకపోవడం ఈ సమస్యని పరిష్కరించకపోవడం అత్యంత దుర్మార్గమని ఇంత నిర్లక్ష్యంగా ఆదివాసుల ప్రజల పట్ల వ్యవహరించడం సరైన పద్ధతి కాదు అని అన్నారు ఇప్పటికైనా itda మరియు స్థానిక సంబంధిత అధికారులు స్పందించి ఆరు నెలలుగా పాడైపోయిన చేతిపంపుని బాగు చేయించాలని సోలార్ సిస్టం ని బాగు చేసి మంచినీటి సౌకర్యాన్ని అదేవిధంగా కరెంటు సౌకర్యాన్ని ఈ గ్రామానికి అందించాలని సంబంధిత ఆ అధికారులను అధికారులను డిమాండ్ చేశారు ఈ గ్రామ ప్రజలకు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ కచ్చితంగా నిరంతరం అండగా ఉంటుందని అన్నారు అధికారులు పట్టించుకోకపోతే కచ్చితంగా పోరాటం నిర్వహిస్తామని తద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ సంయుక్త మండలాల డివిజన్ నాయకులు దాసరి సాయన్న మునిగల శివ, భీమరాజు, శాంతి రాజు, పావని, వీర్రాజు ,సతీష్, కోటేసు, మంగ, శాంతి తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్. బిఆర్ఎస్.ఇరు పార్టీల వారిని గ్రామపంచాయతీ

Read More »

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం”

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం” ​-నా గ్రామ పంచాయతీ మండలంలో ఆదర్శంగా ఉండాలి -లలిత నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 05: ​భద్రాద్రి

Read More »

సర్పంచ్ గా గెలిపిస్తే రమంతపూర్ గ్రామని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

** కాంగ్రెస్ అభ్యర్థి వర్గంటి అనిత గణేష్. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున

Read More »

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. వేద విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేత. వేద పాఠశాలకు సేవలందిస్తా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా లోని సత్యసాయి

Read More »

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం.

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మండలం తాటిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి జవ్వాజి అశ్విని

Read More »

తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ

*తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా వెల్దుర్తి

Read More »

 Don't Miss this News !