+91 95819 05907

భద్రాచలం నియోజకవర్గంలో ముమ్మరంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం…

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేసిన విధంగానే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలను తప్పనిసరిగా నెరవేరుస్తుంది..
భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు

మహబూబాబాద్ పార్లమెంట్ గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండా నే..
అభివృద్ధి కోసం పరితపించే పోరిక బలరాం నాయక్ ని ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు.

మాజీ గ్రంథాలయ చైర్మన్ బోగల శ్రీనివాస్ రెడ్డి

నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం:
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుకుంటూ మాజీ గ్రంథాల చైర్మన్ భోగల శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ *తెల్లం వెంకట్రావు, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ, కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాచల శాసనసభ్యులు తెల్లం వెంకటరావు, ప్రజలతో మమేకమై మాట్లాడుతూ…..

గత పదిలుగా భద్రాచల నియోజకవర్గ అభివృద్ధి కొంటుపడిందని, మళ్లీ ఇంకో ఐదు ఏళ్ళు అభివృద్ధిలో వెనక్కి పోకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీతోనే భద్రాచల నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆలోచించి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి, మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి పోరిక బలరాం నాయక్ నీ కూడా అత్యధిక మెజారిటీతో ఆశీర్వదించి పార్లమెంట్ కు పంపించి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలోకి విచ్చే విధంగా ప్రజలు దీవించాలని.

భద్రాచల నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు హస్తం గుర్తుపై ఓటు వేసి బలరాం నాయక్ ని గెలిపించుకోవడం ద్వారా, ఎమ్మెల్యే నిధులు,ఎంపీ నిధులు తెచ్చుకుని భద్రాచలాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం ఉందని.

ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా,మల్లు బట్టి విక్రమార్క రెవిన్యూ శాఖ మంత్రివర్యులుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , ప్రాతినిధ్యం వహిస్తున్నందున, వారి ముగ్గురు సహకారంతో భద్రాచలం నియోజకవర్గని వేగంగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని ఎన్నికల అయన ప్రచారంలో ప్రజలకు వివరించారు.

దక్షిణాయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయాన్ని, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కానీ, పదియేలు తెలంగాణను పరిపాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ అభివృద్ధి పై ఆలోచన లేకుండా భద్రాచల రామాలయాన్ని విస్మరించారని..

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ భద్రాచల అభివృద్ధికి కట్టుబడి ఉందని, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రాలో విలీనమైన ఐదు గ్రామపంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలిపి భద్రాచలాన్ని అభివృద్ధి చేసి తీరుతుందని.

పోరిక బలరాం నాయక్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడం ద్వారా, తిరుమల తిరుపతి , యాదాద్రి తరహాలో గొప్ప ఆధ్యాత్మిక దేవాలయం లాగా రామాలయాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని ఆయన ప్రజలకు వివరించారు.

ఎన్నికల ప్రచారంలో…..
టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బలుసు నాగ సతీష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరెళ్ళ నరేష్,రాగం సుధాకర్, ఆలీ పాషా, నర్రా రాము,దుద్దుకూరు సాయిబాబా, గండేపల్లి హనుమంతరావు, ఎండి నవాబ్, అన్నేం రామిరెడ్డి,అన్నేం వెంకటేశ్వర రెడ్డి, మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు వసంతాల రాజేశ్వరి,తుమ్మల రాణి,ఒంగోలు దేవకి, కట్టా కళ్యాణి, పద్మప్రియ, రూపా దేవి ,కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలు అధ్యక్షులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి.

జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 శాతం ఇంటింటా సర్వే జరిగింది. సర్వే డేటా ఎంట్రీ తీరును పరిశీలించి, ఆపరేటర్లకు దిశానిర్దేశం చేస్తున్న… జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. నేటి గాదార్, ములుగు జిల్లా ప్రతినిధి,

Read More »

రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు..

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 21: ములుగు మండలం రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు నిర్వహించడం జరిగింది ఇట్టి తనికీ లలో 1)గుగులోతు స్వరూప W/o శ్రీను 2)భూక్య

Read More »

 Don't Miss this News !