+91 95819 05907

ఇట్లా అయితే జీరో కరెంట్ బిల్లు కష్టమే?! కాంగ్రెస్ సర్కారు ఆశయానికి కళ్లెం

– మీటర్ రీడింగ్ లో జాప్యం పేదోళ్లకు శాపం..
– 35 రోజులు,ఆపై రోజ్లు దాటి కరెంటు బిల్లులు కొడుతున్న వైనం
– మీటర్ రీడింగ్ సిబ్బంది కొరత?!
– 200 యూనిట్లు దాటుతున్న రీడింగ్
– గృహ జ్యోతి పథకానికి అనర్హులవుతున్న బీద మధ్యతరగతి కుటుంబాలు

నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 26, భద్రాద్రి కొత్తగూడెం :

దేవుడు వరమిచ్చిన పూజారి కనికరించడాయే అన్న చందంగా కరెంటు వినియోగదారుల పరిస్థితి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గారంటీల్లో భాగంగా 200 యూనిట్ల ఉచిత కరెంటు ప్రజలకు అందజేస్తామని గ్యారెంటీ ఇచ్చిన విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విధితమే. కాంగ్రెస్ గ్యారంటీకి ఓటేసిన ప్రజలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సర్కారును తీసుకువచ్చేందుకు మొగ్గు చూపారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తూ వెళ్తుంది. అందులో భాగంగా అర్హులైన వారికి 200 యూనిట్ల ఉచిత కరెంటు అందించేందుకు గృహ జ్యోతి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. అయితే కాంగ్రెస్ సర్కార్ గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత కరెంటు అందిస్తుంది అనుకున్న ప్రజలకు విద్యుత్ అధికారులు షాక్ ఇస్తున్నారు. కరెంట్ బిల్లు ఇవ్వవలసిన అధికారులు 30 రోజులు దాటిన తర్వాత కరెంటు మీటర్ను రీడింగ్ చేస్తుండడంతో వినియోగించిన కరెంటు 200 యూనిట్లు దాటుతుందని వినియోగదారులు పేర్కొంటున్నారు. నిర్ణీత సమయంలో కరెంటు బిల్లు ఇస్తే అది 200 యూనిట్లలోపే వస్తుందని, కానీ అధికారులు బిల్లు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నందున 200 యూనిట్లు దాటి తాము ఉచిత కరెంటు పథకాన్ని వినియోగించుకోలేకపోతున్నామని ప్రజలు వాపోతున్నారు. ప్రస్తుతం వేసవి కావడంతో విద్యుత్ వినియోగం కాస్త ఎక్కువగా ఉందని, అయినప్పటికీ నెలవారీగా 150 నుండి 200 యూనిట్ల లోపే కరెంటును వినియోగించుకోగలుగుతామని స్థానికులు తెలుపుతున్నారు. అయితే అధికారుల అలసత్వం వహించడం వల్ల ప్రభుత్వం ఉచితంగా కరెంట్ ఇస్తున్నప్పటికీ అధికారులు మాతో కరెంటుకు బిల్లు కట్టిస్తున్న పరిస్థితి ఉన్నతాధికారులు గమనించాలని వినియోగదారులు కోరుతున్నారు. సుమారు 35 రోజుల నుండి 45 రోజుల వరకు కరెంటు రీడింగ్ చేస్తే 200 యూనిట్లకు ఒకటో రెండో యూనిట్లు ఎక్కువ వచ్చినందున కరెంట్ బిల్లు కట్టాల్సిందేనని అధికారులు చెప్పడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. కరెంటు అధికారుల తీరుతో కాంగ్రెస్ సర్కార్ అందిస్తున్న ఉచిత కరెంటు లబ్ధిదారులకు అందని ద్రాక్షగా మారుతుందని పలువురు మేధావులు విమర్శిస్తున్నారు. అధికారులు సమయపాలన పాటించి 30 రోజుల్లోపే కరెంటు రీడింగ్ చేసి బిల్లును ఇస్తే తాము ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్తుకు ఎటువంటి బిల్లును చెల్లించాల్సిన అవసరం లేదు కదా..! అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అలసత్వం అధికారులు అయితే.. నష్టం వినియోగదారులదా..? అలసత్వం వహించిన అధికారులు తమవల్ల వచ్చిన బిల్లును చెల్లిస్తారా అంటూ..? వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

★ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దు : EX ZPTC★

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారెంటీలలోని గృహ జ్యోతి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు అమలు చేసింది. 200 యూనిట్ల ఉచిత కరెంటు ప్రజలకు అందించడం పట్ల రాష్ట్ర ప్రజలు హర్షణ వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సైతం సమయపాలన పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఉచిత కరెంటు విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. 30 రోజులకు మించకుండా ప్రజల కరెంటు మీటర్లు రీడింగ్ చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రజలకు కరెంటు సమస్యలు ఉత్పన్నమవ్వకుండా ఉన్నతాధికారుల సైతం చర్యలు తీసుకోవాలి. – కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, EX ZPTC బట్టా విజయ్ గాంధీ

★కరెంటును పొదుపుగా వినియోగిస్తే జీరో బిల్లుకు అర్హులవుతారు :విద్యుత్ శాఖ Ae
ఆలస్యంగా రీడింగ్ చేసిన కరెంటు బిల్లులకు యావరేజ్ చేసి 30 రోజులకు యావరేజ్ బిల్లు ఇస్తున్నాం. విద్యుత్ వినియోగదారులు పొదుపుగా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తే జీరో బిల్లుకు అర్హులవుతారు.
– ఉపేందర్, విద్యుత్ శాఖ ఏఈ

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

 Don't Miss this News !